Home > జాతీయం > సోనియా గాంధీకి న్యూఇయర్ ట్రీట్.. రాహుల్ ఏం చేశారంటే..?

సోనియా గాంధీకి న్యూఇయర్ ట్రీట్.. రాహుల్ ఏం చేశారంటే..?

సోనియా గాంధీకి న్యూఇయర్ ట్రీట్.. రాహుల్ ఏం చేశారంటే..?
X

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకం. రాజకీయాల్లోనే కాకుండా.. రాహుల్ అప్పుడప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ ఆసక్తికర పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. సామాన్యులకు ఎప్పుడూ చేరువలో ఉండే రాహుల్.. గతంలో ఓ యూట్యూబ్ ఫుడ్ చానల్ లో స్వయంగా వంట చేసి ట్రెండ్ అయ్యారు. తాజాగా మరోసారి ఆయన వంట చేశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో రాహుల్ పక్కన సోనియా గాంధీ ఉండటం.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోనియా, రాహుల్ ఇద్దరూ కలిసి.. స్వయంగా నిమ్మకాయలు కోసుకొచ్చి పచ్చడి చేశారు. దాన్ని జాడీలో నింపి నిలువ చేశారు. అనంతరం న్యూఇయర్ ట్రీట్ గా సోనియా గాంధీకి వంట చేసి పెట్టాడు రాహుల్. దీనిపై స్పందించిన కాంగ్రెస్ శ్రేణులు.. సాధారణ జీవితం గడపడంలో కాంగ్రెస్ నాయకులను మించిన వారు లేరని అంటున్నారు. రాహుల్ గాంధీపై హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated : 31 Dec 2023 6:26 PM IST
Tags:    
Next Story
Share it
Top