Chandrayaan-3: చంద్రమామ వేడిని కొలిచిన ప్రజ్ఞాన్ రోవర్
X
చంద్రుడి దక్షణ ధృవంపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్-3.. తొలిరోజు నుంచే తన పనిని మొదలుపెట్టింది. ఈ క్రమంలో మన మిషన్ చేసిన మొదటి శాస్త్రీయ పరిశోధన వివరాలను ఇస్రో ఆదివారం (ఆగస్ట్ 27) ప్రకటించింది. విక్రమ్ ల్యాండర్ లోని ChaSTE (చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్ పరిమెంట్) పేలోడ్.. చంద్రుడి ఉపరితలంతో పాటు కాస్త లోతులో సేకరించిన సాంపిల్ ఉష్ణోగ్రతల లెక్కలను గ్రాఫ్ రూపంలో తెలిపింది. ChaSTE పేలోడ్.. జాబిల్ల దక్షణ ధృవంలోని నేలపై పొర ఉష్ణోగ్రతను లెక్కిస్తుంది.
దీనిద్వారా చంద్రుడి ఉపరితల థర్మల్ ధర్మాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికున్న పది సెన్సర్ల సాయంతో.. చంద్రుడి నేలపై దాదాపు 10 సెంటిమీటర్ల లోతువరకు చొచ్చుకెళ్లి, టెంపరేచర్ లను లెక్కించే సామర్థ్యం ఈ పేలోడ్ కు ఉంది. ఈ పేలోడ్ పంపిన టెంపరేచర్ వివరాలను మొదటి ప్రొఫైల్ గ్రాఫ్ రూపంలో వివరాలను ఇస్రో తెలిపింది. పూర్తిస్థాయి పరిశీలనలు జరుగుతున్నాయని చెప్పింది. ల్యాండర్ మాడ్యూల్ లోని RAMBHA, ChaSTE, ILSA (ఇన్ స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ) పేలోడ్ లను గురువారం ప్రారంభించారు. అంతేకాకుండా చంద్రయాన్-3 ఇప్పటికే తన రెండు లక్ష్యాలను పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది.
https://twitter.com/isro/status/1695725102166671448?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1695725102166671448|twgr^bdfff2afab5b195a37109c27a301b6971802cee6|twcon^s1_&ref_url=https://d-33388149451838083393.ampproject.net/2308112021001/frame.html
Vikram lander sent temperature data of moon to ISRO
ISRO,Chandrayaan-3,RAMBHA, ChaSTE, ILSA,Chandrayaan-3 update,Chandrayaan-3 first experiment,Vikram lander,Pragyan Rover,Topsoil,moon temperature,moon data