Home > జాతీయం > ప్రభుత్వం కొత్త స్కీం.. పెళ్లి కాని వాళ్లకు నెల నెల పెన్షన్

ప్రభుత్వం కొత్త స్కీం.. పెళ్లి కాని వాళ్లకు నెల నెల పెన్షన్

ప్రభుత్వం కొత్త స్కీం.. పెళ్లి కాని వాళ్లకు నెల నెల పెన్షన్
X

హర్యానా ప్రభుత్వం సరికొత్త స్కీంపై సమాలోచనలు చేస్తోంది. పెళ్లి కాని వాళ్లకు పెన్షన్ అందించేందుకు సిద్ధం అయింది. దీనిపై నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని హర్యానా ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు పెళ్లి చేసుకోని వాళ్లకు ప్రయోజనాలు అందుతాయి. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న అవివాహితులు.. ఈ పథకానికి అర్హులని.. అంతేకాకుండా ఈ పథకం పురుషులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వ తెలిపింది. ఈ పథకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.





‘జన్ సంవాద్’ సందర్జభంగా ఓ 60 ఏళ్ల అవివాహిత వ్యక్తి పెన్షన్ గురించి అడగగా.. దానికి సమాధానంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పెళ్లి కానీ వారు, ఏటా రూ.1.80 లక్షల ఆదాయం ఉన్న వారు, హర్యానాకు చెందిన వ్యక్తులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం అమలులోకి వచ్చిన మొదటి సంవత్సరం 1.25 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది.




Updated : 3 July 2023 3:28 PM IST
Tags:    
Next Story
Share it
Top