Video viral : రోడ్డుపైన వజ్రాలు పడ్డాయి..ఆ తర్వాత ట్విస్ట్ మామూలుగా లేదుగా...
X
వజ్రాల వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్ గుజరాత్‌లోని సూరత్ ప్రాంతం. డైమండ్స్ కొనుగోళ్లు, అమ్మకానికి సూరత్‌లో ఉన్న వరచ్చా ప్రసిద్ధి. తాజాగా ఈ ఊరి పేరు సోషల్ మీడియాలో తెగ నానుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఓ వజ్రాల వ్యాపారీ వజ్రాలు ఉన్న బ్యాగ్‌ను వరచ్చాలోని ఓ రోడ్డుపై పారేసుకున్నాడన్న వార్త వాయువేగంగా వ్యాపించింది. ఆ సంచిలో కోట్లాది రూపాయలు విలువ చేసే వజ్రాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి స్థానికులు ఈ వజ్రాల కోసం వేట సాగించారు. అప్పటి వరకు నిర్మానుశ్యంగా ఉన్న ప్రాంతం కాస్త ఒక్కసారిగా ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. వజ్రాల మూట తమకు లభిస్తుందేమోననే ఆశతో వేట ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
వజ్రాల కోసం ప్రతీ అంగుళాన్ని ఎంతో జాగ్రత్తగా జల్లెడ పట్టారు స్థానికులు. ఇసుకను కూడా వదల్లేదు. పక్కన వాహనాలు పోతున్నా పట్టించుకోలేదు. తమ అదృష్టాన్నివెతికే పనిలోనే నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి ఓ వజ్రం లభించింది. పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. అయితే అది నిజమైన వజ్రమో కాదో అని తెలుసుకునేందుకు ఓ నగల షాపుకు వెళ్లాడు. అక్కడ జువెల్లరీ షాపు యజమాని చెప్పిన విషయానికి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. అది నిజమైన వజ్రం కాదని క్లారిటీ ఇచ్చాడు. అతనికి దొరికింది నకిలీ వజ్రం అని తేడటంతో కళ్ల తేలేశాడు. అది అమెరికన్ డైమండ్ అని దానిని చీర ఎంబ్రాయిడరీ వర్క్స్‌లో వినియోగిస్తారని తెలుసుకుని ఉసూరుమన్నాడు. ప్రాంక్ వీడియోల కోసం ఎవరో కావాలనే ఇలా ప్లాన్ చేసి ఉంటారని అక్కడి వారు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా వజ్రాల కోసం స్థానికులు ఏకంగా రోడ్డునే జల్లెడ పట్టిన వీడియో మాత్రం ఘోరంగా వైరల్ అవుతోంది.
#સુરત વરાછા મિનિબજાર રાજહંસ ટાવર પાસે હીરા ઢોળાયાની વાત થતા હીરા શોધવા લોકોની ભીડ થઈ.
— 𝑲𝒂𝒍𝒑𝒆𝒔𝒉 𝑩 𝑷𝒓𝒂𝒋𝒂𝒑𝒂𝒕𝒊 🇮🇳🚩 (@KalpeshPraj80) September 24, 2023
પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે આ હીરા CVD અથવા અમેરિકન ડાયમંડ છે..#Diamond #Surat #Gujarat pic.twitter.com/WdQwbBSarl