Home > జాతీయం > వందేభారత్ రైలు సమయాల్లో మార్పు.. ఐదు గంటలు ఆలస్యంగా..

వందేభారత్ రైలు సమయాల్లో మార్పు.. ఐదు గంటలు ఆలస్యంగా..

వందేభారత్ రైలు సమయాల్లో మార్పు.. ఐదు గంటలు ఆలస్యంగా..
X

ఇతర రైళ్లకంటే సౌకర్యవంతంగా ఉంటుంది. వేగంగా గమ్యానికి చేరుతుందన్న కారణాలతో.. టికెట్ రేట్లు ఎక్కువున్నా వందే భారత్ రైలు ఎక్కడానికి జనాలు మొగ్గు చూపిస్తున్నారు. అయితే, రైళ్లు ప్రారంభం అయిన కొన్ని రోజులు బాగానే నడిచినా.. రాను రాను సమస్యలు ఎక్కువవుతున్నాయి. రోజుకో కొత్త సమస్య తలెత్తుతోంది. ఈ మధ్య గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పడు ఆ కారణాలతో విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ రైలు సమయాల్లో మార్పు చేశారు అధికారులు. రైలులో అంచనాలకు మించి ఆక్యుపెన్సీ పెరగుతోంది. దీంతో కొన్ని రైళ్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి.



ఇవాళ విశాక నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తుంది. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి విశాఖ చేరుకునే రైలు అర్థరాత్రి దాటకా విశాఖకు చేరుకుంటుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే వందే భారత్‌ రైలు.. ఉదయం 5:45 నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. అది ఐదు గంటలు ఆలస్యంగా ఉదయం 10 గంటలకు ప్రారంభం అయింది. రాత్రి 8 గంటలకు చేరుకోవాల్సిన రైలు అర్థరాత్రి తర్వాత విశాఖ చేరుతుంది. అంతే కాకుండా ఆలస్యంగా బయలుదేరిన రైలులో నాలుగు బోగీల్లో ఏసీలు పనిచేయలేదు. కిటికీలు కూడా తెరుచుకోవడానికి వీలు లేకపోయేసరికి ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

Updated : 17 Jun 2023 1:28 PM IST
Tags:    
Next Story
Share it
Top