ఛత్తీస్ఘడ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
X
ఛత్తీస్ఘడ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో ఆ రాష్ట్ర సీఎంగా విష్ణుదేవ్ సాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ తదితరులు హాజరయ్యారు.
గతంలో విష్ణుదేవ్ సాయ్ ప్రధాని మోడీ తొలి కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1990 నుంచి ఛత్తీస్‌ఘఢ్ బీజేపీలో కీలక గిరిజన నేతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కూడా విష్ణుదేవ్‌కు దక్కింది. ఛత్తీస్‌గఢ్‌లో 29 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ చేయగా.. బీజేపీ 17 చోట్ల విజయం సాధించింది. దీంతో సీఎం అయ్యే అవకాశం విష్ణుదేవ్కు దక్కింది.