Home > జాతీయం > ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్..

ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్..

ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్..
X

ఎట్టకేలకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎవరన్నది తేలింది. ఛత్తీస్​గఢ్​ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ఎంపికయ్యారు. ఎన్నో చర్చల తర్వాత బీజేపీ ఆయన్ని శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంది. రాయ్​పుర్​లోని బీజేపీ ఆఫీసులో శాసనసభా పక్షం సమావేశమైంది. ఈ భేటీకి పరిశీలకులుగా కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, శర్బానంద సోనోవాల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ సీఎం రమణ్ సింగ్ను కాదని.. విష్ణుదేవ్ సాయ్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నారు. విష్ణుదేవ్‌ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాగా తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 54 స్థానాలను కైవసం చేసుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ 39 సీట్లకే పరిమితమైంది.

Updated : 10 Dec 2023 4:36 PM IST
Tags:    
Next Story
Share it
Top