Home > జాతీయం > విమానాన్ని ఢీకొట్టిన ట్రక్కు.. ఎలా జరిగిందంటే..?

విమానాన్ని ఢీకొట్టిన ట్రక్కు.. ఎలా జరిగిందంటే..?

విమానాన్ని ఢీకొట్టిన ట్రక్కు.. ఎలా జరిగిందంటే..?
X

సాధారణంగా రోడ్లపై వాహనాలు ఢీకొంటాయి. కానీ ఓ వాహనం విమానాన్ని ఢీకొట్టింది. వాహనం ఢీకొట్టే సమయంలో విమానంలో 140మంది ప్రయాణికులు ఉన్నారు. ముంబై ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. ముంబై ఎయిర్ పోర్టులో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విస్తారా ఎయిర్​లైన్స్​కు చెందిన విమానాన్ని సరుకులు తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ఈ సమయంలో విమానంలో 140మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వారికి ఎటువంటి గాయలు కాలేదు. ఈ ప్రమాదంలో విమానం ఇంజిన్​ దెబ్బతింది.

‘‘ఆగస్టు 1న ముంబై నుంచి కోల్‌కతాకు బయలుదేరిన విమానాన్ని సామాన్లు తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ఇంజిన్ దెబ్బతింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్య స్థానాలకు చేర్చాం. అదృష్టవశాత్తు ప్రయాణికులలెవరికి గాయాలు కాలేదు’’ అని విస్తార్ ఎయిర్​లైన్స్​ తెలిపింది.

జనవరిలో ఎయిర్ విస్తారా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న ఈ విమానానికి హైడ్రాలిక్​ సమస్య తలెత్తింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం విమానం ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పుడు కూడా విమానంలో దాదాపు 140 మంది ప్రయాణికులు ఉన్నారు.



Updated : 2 Aug 2023 11:53 AM IST
Tags:    
Next Story
Share it
Top