Mumbai: 'అంకుల్.. కొంచెం పక్కకు జరుగుతారా’.. ఈయన రియాక్షన్ ఇదే
X
వయస్సులో తమ కంటే పెద్దవాళ్లు , లేదంటే దాదాపు సమానమైన ఏజ్ ఉన్నవారు .. ఆంటీ, అంకుల్ అని పిలిస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇటీవల కర్ణాటకలో ఏటీఎంకి వెళ్లిన మహిళను అక్కడి సెక్యూరిటి గార్డు ఆంటీ అని పిలిచినందుకు.. అతన్ని చితకబాదిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన హంగామా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా, ముంబయి లోకల్ ట్రైన్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే ఈసారి అలాంటి పిలుపు ఓ ప్రయాణికుడికి ఎదురైంది.
ఆ వీడియోలో.. ముంబై లోకల్ రైలు డోర్ దగ్గర ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. వీడియోలో కనిపించని మరో వ్యక్తి.. వచ్చే స్టేషన్‌లో క్రిందికి దిగడానికి కొంచెం పక్కకు తప్పుకోమని అడిగాడు. ‘అంకుల్ తర్వాతి వచ్చే స్టేషన్ బోరివలీ.. మీరు నిలబడి దిగేవారికి దారి ఇవ్వండి" అని చెప్పగా.. ఆ వ్యక్తి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మళ్లీ.. "హలో అంకుల్ కొంచెం నిలబడి ఆపై కూర్చోండి" అని చెప్పాడు. దీనికి ఆ వ్యక్తి.. ‘నువ్వు ఎవరిని అడుగుతున్నావో అర్థం కావడం లేదు’ అని అడగ్గా... 'కింద కూర్చున్నదెవరు' అంటూ కౌంటర్ వేశాడు. ఈ కౌంటర్ కి ఎన్ కౌంటర్‌లాగా .. 'మరి నీకు అంకుల్ ఎవరు' అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. చివరకు ఆ వ్యక్తి 'అన్నా.. కొంచెం పక్కకు జరగండి' అంటూ పిలవడం వీడియోలో కనిపిస్తోంది.
వీడియోలో ఆయన రియాక్షన్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ముంబయి మ్యాటర్స్ తన ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ‘ముంబయి లోకల్ ట్రెయిన్‌లో పొరపాటున ఎవ్వర్నీ అంకుల్ అని పిలవకండి’ అనే క్యాప్షన్ జోడించింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. ఎక్కడైనా.. ఎవర్నీ అంకుల్ లేదా ఆంటీ అని పిలవకండి.. ఇది అవమానించడమే.. కొంచెం మర్యాదగా పిలవాలి’ అని కామెంట్ చేశారు.
Never call someone UNCLE inside a #MumbaiLocal😂😂😂 pic.twitter.com/hu8oPLYHSS
— मुंबई Matters™ (@mumbaimatterz) October 15, 2023