పోర్న్ వీడియోలు చూస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన తీర్పు
X
కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రహస్యంగా అశ్లీల వీడియోలు చూస్తే తప్పేంకాదని చెప్పింది. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి షేర్ చేయకుండా ఒక్కరే పోర్న్ వీడియోలను చూస్తే అది అతడి వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది. దీనిని నేరంగా పరిగణిస్తే అతడి వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవడమే అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పోర్నోగ్రఫీ అనేది శతాబ్దాలుగా కొనసాగుతోందని, డిజిటల్ యుగంలో మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చిందని న్యాయమూర్తి అన్నారు.
2016లో కొచ్చిలోని అలువా ప్యాలెస్ సమీపంలో రోడ్డు పక్కన 33ఏళ్ల ఓ వ్యక్తి తన ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 292 కింద పోలీసులు నమోదు చేశారు. దీంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. తనపై పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ నిందితుడు తన పిటిషన్ లో కోరాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ కేసును కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒక వ్యక్తి ప్రైవేట్గా పోర్న్ వీడియోలు లేదా అశ్లీల ఫొటోలు చూడడం అనేది ఐపీసీ సెక్షన్ 292 ప్రకారం నేరం కాదు. నిందితుడు అశ్లీయ వీడియోలను ఎవరికైనా పంపించడం లేదా బహిరంగంగా చూడడం నేరం. కానీ రహస్యంగా వీడియోలు చూడడం అతడి వ్యక్తిగత ఎంపిక ఇందులో జోక్యం చేసుకోవడం అతడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే’’ అని న్యాయమూర్తి అన్నారు. అదేవిధంగా పిల్లలకు ఫోన్లు ఇవ్వడంపట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.