Home > జాతీయం > రెజ్లింగ్ పోటీల్లో ఎటువంటి రూల్స్ అతిక్రమించలేదు : సంజయ్ సింగ్

రెజ్లింగ్ పోటీల్లో ఎటువంటి రూల్స్ అతిక్రమించలేదు : సంజయ్ సింగ్

రెజ్లింగ్ పోటీల్లో ఎటువంటి రూల్స్ అతిక్రమించలేదు : సంజయ్ సింగ్
X

తాను ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని సస్పెండ్ అయిన డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ తెలిపారు. తమకు మరికొంత సమయం ఇచ్చి..సస్పెన్షన్ ఎత్తేయాలని క్రీడాశాఖను కోరతామన్నారు. ఒకవేళ క్రీడాశాఖ స్పందించకపోతే న్యాయపరంగా ముందుకెళ్తామని చెప్పారు. 24 రాష్ట్రాల రెజ్లింగ్ సంఘాల ఆమోదంతోనే టోర్నీల నిర్వహణపై నిర్ణయాలు తీసుకున్నామని.. దానికి సంబంధించి ఆధారాలు కూడా సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీ సహా క్రీడల మంత్రితోనూ మాట్లాడతానని చెప్పారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ఇకపై రెజ్లింగ్ వ్యవహారాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.

కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్‌ను క్రీడా శాఖ సస్పెండ్ చేసింది. ఉత్తర్​ప్రదేశ్ గోండాలో జరిగే కుస్తీ పోటీలకు తొందరపాటుగా అండర్-15, అండర్-20 జట్లను ఎంపిక చేసినందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పారదర్శకత, ఇతర కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్.. గత అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు అత్యంత సన్నిహితుడు. ఈ క్రమంలో రెజ్లర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో క్రీడా శాఖ కొత్త ప్యానెల్ను సస్పెండ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Updated : 25 Dec 2023 7:00 AM IST
Tags:    
Next Story
Share it
Top