Home > జాతీయం > Imran Khan : ప్రతిపక్షంలో కూర్చుంటాం.. పీటీఐ పార్టీ ప్రకటన

Imran Khan : ప్రతిపక్షంలో కూర్చుంటాం.. పీటీఐ పార్టీ ప్రకటన

Imran Khan : ప్రతిపక్షంలో కూర్చుంటాం.. పీటీఐ పార్టీ ప్రకటన
X

హోరా హోరీ పోటీ నడుమ పాక్ ఎన్నికలు ముగిశాయి. అంతా అనుకున్నట్లుగానే దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. పాక్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించింది పీటీఐ పార్టీ. అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు సరైన అనుకూలత లేకపోవడంతో.. పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ నిర్ణయించింది. ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పీటీఐ నేత బారిస్టర్‌ అలీ సయీఫ్‌ ప్రకటించారు. ఒకవేళ ఓట్లు, సీట్లను తారుమారు చేయకుంటే ఇవాళ పీటీఐ పార్టీకి 180 స్థానాలు వచ్చి ఉండేవని అని.. మమ్మల్ని మోసం చేశారని ఆరోపించారు. అందుకే ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పాక్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచడానికి చేతులు కలిపిన పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఈ రెండు పార్టీలు కలిసి షెహబాజ్‌ షరీఫ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అధికార రహస్యాల ఉల్లంఘన, తోషాఖానా కేసుల్లో ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షలను ఇస్లామాబాద్‌ హైకోర్టులో ఇమ్రాన్‌ఖాన్‌ సవాల్‌ చేశారు. అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్‌కు ఈ రెండు కేసుల్లోనూ కోర్టు వరుసగా 10,14 ఏళ్ల జైలు శిక్షలను విధించింది. సైఫర్‌ కేసులో ఇమ్రాన్‌ భార్య బుష్రా బీబీకి కూడా కోర్టు 14 ఏళ్ల శిక్ష విధించింది. ప్రస్తుతం ఆమె కూడా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.


Updated : 17 Feb 2024 2:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top