Home > జాతీయం > అత్త నచ్చలేదని పిల్లకు తాళి కట్టకుండా వెళ్లిపోయిన వరుడు

అత్త నచ్చలేదని పిల్లకు తాళి కట్టకుండా వెళ్లిపోయిన వరుడు

అత్త నచ్చలేదని పిల్లకు తాళి కట్టకుండా వెళ్లిపోయిన వరుడు
X

ఈ మధ్యకాలంలో పీటలమీద పెళ్లిళ్లు పెటాకలవుతున్నాయి. చిన్నచిన్న కారణాలకే తాళికట్టే సమయంలో వధువు, వరులు పెళ్లిళ్లు రద్దు చేసుకుంటున్నారు. భోజనంలో చికెన్ లేదని, డీజే ఏర్పాటు చేయలేదని కూడా వివాహాలు క్యాన్సిల్ అయ్యాయి. తాజాగా పెళ్లి కూతురు తల్లి నచ్చలేదని ఓ వరుడు పెళ్లికి నిరాకరించాడు. తన జీవితంలోకి వచ్చే పెళ్లి కూతురే కాదు..వాళ్ల తల్లి కూడా సక్రమంగా ఉండాలని భావించాడు ఆ వరుడు. అలా లేరని తెలిసి తాళికట్టే సమయానికి వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

సంభాల్ జిల్లాలో సరయాత్రిన్‌ చెందిన యువకుడికి, రాజ్‌పురాకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. జూన్‌ 27న సాయంత్రం వరుడు ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకున్నాడు. వరుడి రాకతో కల్యాణ వేదిక సందడిగా మారింది. వివాహవేదిక వద్దకు వరుడికి ఆహ్వానం పలికేందుకు అత్తింటి వారు డీజేతో డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లారు. బంధు, మిత్రులు పాటలకు డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. అయితే ఈ సమయంలో వధువు తల్లి కూడా ఉత్సాహంగా స్టెప్పులు వేసింది. కుమార్తె వివాహం కావడంతో ఆనందంతో ఎగరిగెంతేసింది. అయితే అత్త వ్యవహారంపై అల్లుడికి కోపం వచ్చింది. అత్త సిగరెట్ తాగుతూ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను చూసిన వరుడు ఆశ్చర్యపోయాడు. క్షణం ఆలోచించకుండా పెళ్లిని రద్దు చేసుకున్నాడు. పెళ్లి జరగదని వరుడు తెగేసి చెప్పేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వరుడు తన కుటుంబంతో ఇంటికి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే పెద్దల చర్చల అనంతరం మళ్లీ పెళ్లికి అంగీకరించినట్టు తెలుస్తోంది.

Updated : 1 July 2023 6:55 PM IST
Tags:    
Next Story
Share it
Top