Home > జాతీయం > బావిలో పడ్డ ఎద్దు.. రక్షించడానికి వెళ్లిన ఐదుగురు అనంతలోకాలకు..

బావిలో పడ్డ ఎద్దు.. రక్షించడానికి వెళ్లిన ఐదుగురు అనంతలోకాలకు..

బావిలో పడ్డ ఎద్దు.. రక్షించడానికి వెళ్లిన ఐదుగురు అనంతలోకాలకు..
X

ఓ ఎద్దు బావిలో పడింది. దానిని రక్షించేందుకు స్థానికులు రంగంలోకి దిగారు. మొత్తం 8మంది ఎద్దును పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మట్టి కూలి ఐదుగురు మరణించగా.. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జార్ఖాండ్ రాష్ట్ర రాజధాని రాంచీకి 70కి.మీ. దూరంలోని ఓ గ్రామంలో జరిగింది.

పిస్కా గ్రామంలో సాయంత్రం ఓ ఎద్దు బావిలో పడింది. దీనిని గమనించిన స్థానికులు దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. నలుగురు వ్యక్తులు తాడు సహాయంతో బావిలోకి దిగగా.. మరో నలుగురు పైన ఉండి బయటకు లాగుతున్నారు. ఈ సమయంలోనే బావిపైన ఉన్న మట్టిదిబ్బలు కూలడంతో పైనున్న నలుగురు బావిలో పడ్డారు. మొత్తం 8మంది మట్టిలో కూరుకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

బావిలో పడిన 8మందిలో ముగ్గురిని పోలీసులు రక్షించారు. మిగితా ఐదుగురు చనిపోయినట్లు చెప్పారు. భారీ యంత్రం సాయంతో వారి మృతదేహాలను బయటకు తీసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సుదేశ్ మహాతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబసభ్యులను ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా ఐదుగురితో ఘటనాస్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి.



Updated : 18 Aug 2023 10:53 AM IST
Tags:    
Next Story
Share it
Top