Home > జాతీయం > రైలుకు ఎదురెళ్లి వందల మందిని కాపాడిన బాలుడు

రైలుకు ఎదురెళ్లి వందల మందిని కాపాడిన బాలుడు

రైలుకు ఎదురెళ్లి వందల మందిని కాపాడిన బాలుడు
X

పదేళ్ల పసివాడు.. తన సమయస్ఫూర్తితో ఓ రైలును పెను ప్రమాదం నుంచి తప్పించాడు. వందల మంది ప్రాణాలు కాపాడి.. స్థానికంగా ఒక్కసారిగా హీరో అయిపోయాడు. బాలుడి సాహసానికి మెచ్చి నార్త్​ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే అవార్టు ప్రకటించింది. పశ్చిమబెంగాల్‌లోని మల్దా జిల్లాకు చెందిన ముర్సెలీమ్ అనే పదేళ్ల ఓ బాలుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి.. పట్టాలపై వేగంగా దూసుకు వస్తున్న రైలును త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించాడు.

హరిశ్చంద్రపుర్‌ రెండో బ్లాక్‌లోని కరియాలి గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న ముర్సెలీమ్.. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కుంటలో చేపలు పట్టడానికి వెళ్లాడు. అతడు చేపలు పడుతున్న ప్రదేశానికి సమీపంలో రైలు పట్టాలు ఉన్నాయి. ఈ క్రమంలో ముర్సెలీమ్​ రైలు పట్టాల కింద పెద్ద గుంత ఉండటం గమనించాడు. అంతలోనే అదే పట్టాలపై అగర్తల-సియాల్దా కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్‌ వేగంగా దూసుకువస్తోంది. అప్రమత్తమైన ముర్సెలీమ్ వేగంగా పట్టాల వద్దకు పరుగెత్తాడు. తన ఒంటిపై ఉన్న ఎర్ర టీషర్టు విప్పి లోకోపైలట్​కు సిగ్నల్​ ఇచ్చాడు. అలా టీషర్టు ఊపుతూ కొద్దరి సేపు నిలబడ్డాడు

బాలుడిని గమనించిన లోకోపైలట్‌ వెంటనే రైలును నిలిపివేశారు. ఇంజిన్‌ దిగి, పట్టాల పరిస్థితి చూసి బాలుడిని అభినందించారు. వర్షాలకు పట్టాల కింద మట్టి, కంకర కొట్టుకుపోయినట్లు ఆయన ఇచ్చిన సమాచారంతో వివిధ విభాగాల రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రంధ్రాన్ని పూడ్చివేశారు. గంట తర్వాత రైలు యథావిథిగా బయలుదేరింది. ఈ సంగతి తెలిసిన స్థానిక జనం శుక్రవారం రాత్రి నుంచి ముర్సెలీమ్ ఇంటివద్దకు వచ్చి ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన తూర్పు రైల్వే ఛీప్​ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- సీపీఆర్​ఓ కౌశిక్ మిత్రా.. ముర్సెలీమ్​ను ప్రశంసించారు. నార్త్​ ఈస్టర్న్​ ఫ్రాంటియర్​ రైల్వే తరఫున ముర్సెలీమ్​కు అవార్డు ప్రకటించారు.




Updated : 24 Sept 2023 7:49 AM IST
Tags:    
Next Story
Share it
Top