Home > జాతీయం > రైలు ప్రమాదం వెనుక కుట్ర.. మమతా బెనర్జీ

రైలు ప్రమాదం వెనుక కుట్ర.. మమతా బెనర్జీ

రైలు ప్రమాదం వెనుక కుట్ర.. మమతా బెనర్జీ
X

278 మందిని బలితీసుకున్న ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాద ప్రాంతానికి నేతల రాక మొదలైంది. పొరుగు రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ఉదయం బహానాగ్ బజార్ చేరుకుని వివరాలు కనుక్కున్నారు. మృతుల్లో, క్షతగాత్రుల్లో అత్యధికరులు బెంగాల్ వాసులో కావడంతో ఆమె హుటాహుటిన సహాయక కార్యక్రమాలకు ఆదేశించారు. ఘటనా స్థలంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

‘‘ఈ ప్రమాదం వెనక ఏదో ఉన్న ఉందనే అనుమానాలు వస్తున్నాయి. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు. కానీ ఇంత ప్రాణ నష్టం జరగడం మామూలు విషయం కాదు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధితులకు న్యాయం చేయాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’ అని మమత డిమాండ్ చేశారు.


కాగా, ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణించిన తెలుగువారి విరాలను రైల్వే శాఖ వెల్లడించింది. రైల్లో ఏపీకి చెందిన 178 మంది ఉన్నారు. 1AC - 9, 11 AC - 17, 3A - 114, స్లీపర్ క్లాస్‌లో 38మంది ప్రయాణించారు. వీరిలో విజయవాడకు రావాల్సినవారు 33 మంది.


Updated : 3 Jun 2023 2:17 PM IST
Tags:    
Next Story
Share it
Top