viral news : పెంపుడు కుక్క చనిపోతే ఇలా కూడా చేస్తారా..!
X
ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులలో కుక్క ప్రధానమైనది. అది చూపే విశ్వాసానికి మనుషులు వాటిలో ఒకరకమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. సొంత మనిషాలనే దానిని చూస్తారు. వాటికి పుట్టిన రోజులు లాంటి ఫంక్షన్‌లను కూడా చేస్తారు. ఇలా ప్రాణాతి ప్రాణంగా పెంచుకున్న జంతువులకు జరగరానిది జరిగితే తట్టుకోవడం చాలా కష్టం. వారి బాధ చెప్పలేనిది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
పోడూరు మండలం పెనుమదం గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి ఓ కుక్కను పెంచుకున్నాడు. 15 ఏళ్ల క్రితం బంధువల ఇంటి దగ్గర నుంచి దానిని తెచ్చి సాయి అని పేరు పెట్టాడు. ఈ 15 ఏళ్లు దానిని అపురూపంగా చూసుకున్నాడు. అయితే ఇటీవల ఆ పెంపుడు కుక్క మరణించింది. దీంతో దానిని మరణాన్ని రాంబాబు తట్టుకోలేకపోయాడు .దానికి హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్ని కార్యక్రమలు పూర్తిచేశారు. సంస్మరణ కూడా నిర్వహించి.. 11వ రోజున గ్రామంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కొందరు కుటుంబ సభ్యులు కుక్క సాయి చర్యలను తలచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. సొంత కుటుంబ సభ్యులనే పట్టించుకోని ఈ రోజుల్లో ఓ కుక్కకు అంతిమ సంస్కారలు నిర్వహించి, భోజనాలు పెట్టడంతో రాంబాబును గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.