ఇంకా ఒక్కరోజే మిగిలుంది.. పాన్, ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుంది..?
X
పాన్ కార్డ్ తో ఆధార్ కార్డ్ లింక్ చేసుకునేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు రేపటితో (జూన్ 30) ముగిసిపోతుంది. 2017లో పాన్ కార్డ్ ను ఆధార్ కార్డ్ తో లింక్ చేయాలని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వాస్తవానికి ఆధార్, పాన్ లింక్ గడువు చివరి తేదీ వాస్తవానికి మార్చి 31, 2022తో ముగియాల్సి ఉంది. కానీ, దాన్ని పొడగిస్తూ.. మార్చి 31, 2023న చివరి తేదీ చేసింది. ఆ తర్వాత కూడా చివరి తేదీని మళ్లీ జూన్ 30, 2023 చేసింది. కానీ, ప్రస్తుతం పొడగించే అవకాశం మాత్రం కనిపించట్లేదు. అయినా, ఇప్పటికీ లక్షల మంది అనుసంధానం చేసుకోలేదని ఇన్ కమ్ ట్యాక్స్ తెలిపింది. చేసుకోనివాళ్లు త్వరగా లింక్ చేసుకోవాలని కోరింది. అయితే, ఆధార్ పాన్ లింక్ చేసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోండి...
పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే..?
1. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేరు
2. పెండింగ్ లో ఉన్న మీ ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ ఆగిపోతుంది
3. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన రిఫండ్స్ రావు
4. ట్యాక్స్ రిటర్న్స్ విషయంలో.. పెండింగ్ లో ఉన్న అన్ని పనులు నిలిచిపోతాయి. అప్లికేషన్ వెరిఫికేషన్ కూడా నిలిచిపోతుంది
5. పాన్ కార్డు పని చేయదు కాబట్టిక.. పన్ను మినహాయింపులు అధికంగా ఉంటాయి.
6. సహజంగా వచ్చే ట్యాక్స్ రాయితీలను కోల్పోతారు. దీని వల్ల ట్యాక్స్ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది
6. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే.. పాన్ కార్డు తాత్కాలికంగా బ్లాక్ అవుతుంది