Home > జాతీయం > Ayodhya Ram Mandir : రాముని ప్రాణప్రతిష్ఠ.. అయోధ్యలోని ముస్లింలు ఏమనుకుంటున్నారు..?

Ayodhya Ram Mandir : రాముని ప్రాణప్రతిష్ఠ.. అయోధ్యలోని ముస్లింలు ఏమనుకుంటున్నారు..?

Ayodhya Ram Mandir : రాముని ప్రాణప్రతిష్ఠ.. అయోధ్యలోని ముస్లింలు ఏమనుకుంటున్నారు..?
X

అయోధ్య హిందూ-ముస్లింల సమ్మేళనం. ఇక్కడ హిందువులతో పాటు పెద్ద ఎత్తున ముస్లింలు ఉంటారు. ఈ నగరంలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. మధ్యాహ్నం బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ మహోత్సవం వేళ అయోధ్యలో ముస్లింలు ఎలా ఉన్నారు..? అయోధ్య ప్రాణ ప్రతిష్ఠపై వారు ఏమనుకుంటున్నారు.?. పెద్ద ఎత్తున హిందువుల రాకతో వాళ్లంతా మళ్లీ భయపడుతున్నారా.. లేక సంతోషంగా ఉన్నారా..? ఆలయ నిర్మాణంతో భవిష్యత్పై ఎటువంటి ఆశలతో ఉన్నారు..? అనేది ఆసక్తిగా మారింది.

1992లో అయోధ్యలో బాబ్రి మసీదు కూల్చివేతతో వివాదం చెలరేగింది. ఎన్నో ఏళ్ల న్యాయపోరాటం తర్వాత 2019లో అయోధ్యలోని వివాదస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి దాదాపు 20కిలోమీటర్ల దూరంలో కొత్త మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించారు. దాదాపు 30లక్షల జనాభా గల అయోధ్య జిల్లాలో ముస్లింలు 5లక్షలు ఉంటారు. వీరిలో 5వేల మంది వరకు రామ మందిరం చుట్టు పక్కల ఉన్నారు. రాముని ప్రాణ ప్రతిష్ఠ వంటి మహోత్సవం వేళ అక్కడి ముస్లింలలో ఏదో మూల చిన్న భయాందోళన ఉన్నా ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉన్నారు.

అయోధ్యలో తామంతా సంతోషంగా ఉన్నామని ముస్లింలు చెబుతున్నారు. 1992 తర్వాత మళ్లీ అటువంటి అల్లర్లు జరగలేదని స్పష్టం చేశారు. అయితే తమ మతపరమైన స్థలాలాను కూడా మరమ్మత్తు చేస్తే బాగుండేదని అయోధ్య సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ అభిప్రాయపడ్డారు. అయోధ్య సమాజం ఎటువంటి రాజకీయ ఉచ్చులో పడొద్దని అనుకుంటుందని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అలాగే ఉండనిస్తే చాలాని చెప్పారు. మరికొంత మంది ముస్లింలు ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ వేడుక వేళ అయోధ్యకు దూరంగా వెళ్తున్నారు. ఇక ఆలయానికి చుట్టు పక్కల ఉండే స్వీట్ షాపుల్లో ముస్లింలు తయారు చేసే స్వీట్లే పంపిణీ అవుతున్నాయి. ఇక్కడ తామంతా సోదరుల్లా కలిసే ఉంటామని.. ఎటువంటి విబేధాలు లేవని అయోధ్య ఎంపీ లల్లూ సింగ్ చెప్పారు.

Updated : 22 Jan 2024 8:33 AM IST
Tags:    
Next Story
Share it
Top