Home > జాతీయం > పార్లమెంటు పాత బిల్డింగు సంగతేంటి.. దాన్ని ఏం చేస్తారు?

పార్లమెంటు పాత బిల్డింగు సంగతేంటి.. దాన్ని ఏం చేస్తారు?

పార్లమెంటు పాత బిల్డింగు సంగతేంటి.. దాన్ని ఏం చేస్తారు?
X

థంబ్ : పాత బిల్డింగును కూల్చేస్తారా..?

పార్లమెంటు కొత్త బిల్డింగులో మంగళవారం నుంచి ఉభయ సభలు కొలువుదీరనున్నాయి. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన పాత భవనం రాజ్యాంగాన్ని ఆమోదించడంతో పాటు ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచింది. బ్రిటిష్ వాస్తు శిల్పులైన సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్డ్ బేకర్ ఈ బిల్డింగ్ రూపొందించారు. స్వాతంత్ర్య పోరాటం, ఆ తర్వాత దేశం ఎదుగుదలను కళ్లారా చూసింది. పార్లమెంటు పాత భవనాన్ని నిర్మించింది బ్రిటీష్ పాలకులే అయినా.. దాన్ని కట్టడానికి పడ్డ శ్రమ, డబ్బు మనదే.

పార్లమెంటు కొత్త బిల్డింగ్ అందుబాటులోకి రావడంతో పాత భవనాన్ని ఏం చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ దాన్ని ఏం చేస్తారు? ఆ బిల్డింగును కూల్చేసి కొత్త భవనం కడతారా లేదా మరి దేనికోసమైనా వాడతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటు బిల్డింగును కూల్చివేసే ప్రసక్తే లేదని కేంద్రం ప్రకటించింది. పార్లమెంటరీ కార్యకలాపాల కోసం దాన్ని వినియోగించుకోనున్నట్లు చెప్పింది.

పాత పార్లమెంట్ భవనం దేశ పురావస్తు సంపద. అందుకే ఈ చారిత్రక కట్టడాన్ని పరిరక్షించాలని కేంద్రం నిర్ణయించింది. 2021లోనే మోడీ సర్కారు దీనిపై క్లారిటీ ఇచ్చింది. పాత భవనానికి మరమ్మత్తులు చేసి, ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పింది. నేషనల్ ఆర్కైవ్‌లను కొత్త పార్లమెంట్ బిల్డింగులోకి మార్చనున్నందున పాత భవనంలో మరింత ఖాళీ స్థలం అందుబాటులోకి వస్తుందని కేంద్రం చెబుతోంది. పాత భవనంలోని కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చే అవకాశముందని అంటోంది.




Updated : 19 Sept 2023 8:53 AM IST
Tags:    
Next Story
Share it
Top