Home > జాతీయం > I-N-D-I-A.. ఇంతకీ అర్థమేంటో తెలుసా..?

I-N-D-I-A.. ఇంతకీ అర్థమేంటో తెలుసా..?

I-N-D-I-A.. ఇంతకీ అర్థమేంటో తెలుసా..?
X

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడమే లక్ష్యంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. బెంగళూరు వేదికగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పనిలో పనిగా కూటమి పేరు మార్చుతున్నట్లు ప్రకటించాయి. 2004 లో ఏర్పడిన యునైటెట్ ప్రోగ్రెసివ్ అలయన్స్ - యూపీఏ ను ఇప్పుడు I-N-D-I-Aగా మార్చారు. రాహుల్ ప్రతిపాదించిన ఈ పేరుపై అన్ని పార్టీల నేతల అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాల కూటమికి పెట్టిన పేరుకు అర్థమేంటంటే..

I - ఇండియన్

N - నేషనల్

D - డెవలప్మెంటల్

I - ఇన్క్లూసివ్

A - అలియెన్స్

కూటమి పేరు మార్పుతో పాటు నేతలు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 11 మంది సభ్యులతో త్వరలోనే కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ముంబైలో జరగనున్న మీటింగ్ లో సభ్యుల పేర్లు ప్రకటించనున్నట్లు చెప్పారు. ఆ భేటీకి సంబంధించిన తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. క్యాంపెయిన్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఢిల్లీలో సెక్రటేరియెట్ తో పాటు ఇతర కమిటీలను ఏర్పాటు చేసేందుకు భాగస్వామ్య పార్టీలన్నీ అంగీకరించాయి.

బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని ఇండియా నేతలు మండిపడుతున్నారు. మోడీ హయాంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల తీవ్రస్థాయికి చేరిందని ఆరోపించారు. విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు స్వతంత్ర్య ప్రతిపత్తి గల సంస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని నేతలు మండిపడ్డారు. కమలదళానికి వ్యతిరేకంగా తామంతా పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


Updated : 18 July 2023 7:33 PM IST
Tags:    
Next Story
Share it
Top