India Budget : భారతదేశ చరిత్రలో తొలి బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారో తెలుసా?
X
మధ్యంతర బడ్జెట్‌కు కేంద్రం సిద్దమవుతుంది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.. సాధారణంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు మధ్యంతర బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రిటీష్ కాలంలోనే మన దేశంలో బడ్జెట్‌ను సమర్పించే సంప్రదాయం మొదలైంది. బ్రిటీష్ ప్రభుత్వం 1860లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత బడ్జెట్ సమర్పణలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం దేశానికి బడ్జెట్‌ను సమర్పించే సంప్రదాయాన్ని ప్రారంభించింది
తొలి బడ్జెట్‌ను సమర్పించింది ఎవరు?
దేశంలో మొదటి బడ్జెట్‌ను ఈస్టిండియా కంపెనీకి సంబంధించిన స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ సమర్పించారు. ఫిబ్రవరి 18వ తేదీ 1860వ సంవత్సరంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు. 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. స్వాతంత్య్రానంతరం దేశానికి తొలి బడ్జెట్‌ను సమర్పించిన ఘనత ఆర్కే షణ్ముఖం చెట్టిదే. అతను 26 నవంబర్ 1947న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించాడు. చెట్టి ఆర్థికవేత్త, వృత్తిరీత్యా న్యాయవాది కూడా . ఇక దేశ తొలి బడ్జెట్‌లో పన్ను ప్రతిపాదన లేదు. ఇది 15 ఆగస్టు 1947 నుండి 31 మార్చి 1948 వరకు అయలయ్యేలా రూపొందించారు.