Home > జాతీయం > Solar Eclipse 2024 : ఆ రోజే సంపూర్ణ సూర్యగ్రహణం.. మీకు తెలియని ఆసక్తికర విషయాలు..

Solar Eclipse 2024 : ఆ రోజే సంపూర్ణ సూర్యగ్రహణం.. మీకు తెలియని ఆసక్తికర విషయాలు..

Solar Eclipse 2024 : ఆ రోజే సంపూర్ణ సూర్యగ్రహణం.. మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
X

ఖగోళం ఎన్నో అద్భుతాలకు పుట్టినిల్లు. ఖగోళంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. గ్రహణాలు తరుచుగా ఏర్పడుతుంటాయి. అయితే ఒక్కోసారి సంపూర్ణ గ్రహణాలు ప్రజలను, శాస్త్రవేత్తలను ఆకర్షిస్తాయి. ఇక 2024లో 5 గ్రహణాలు ఏర్పడనున్నాయి. 2 సూర్యగ్రహణాలు, 3 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు రావడాన్ని సూర్యగ్రహణంగా పిలిస్తే.. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి రావడాన్ని చంద్రగ్రహణంగా పిలుస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 8న తొలి గ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఏప్రిల్ 8న వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడతుంది. 2017లో అగస్ట్ 21న సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడింది. అప్పుడు అమెరికాలో ఇది స్పష్టంగా కనిపించింది. ఇక ఈసారి గ్రహణం సమయంలో సూర్యుడు మరింత పెద్దగా ప్రకాశిస్తాడు. అలాగే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిమాణం చాలా పెద్దగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఈ సారి సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలో స్పష్టంగా కన్పిస్తుందని నాసా తెలిపింది. మెక్సికోలోని పసిఫిక్ సముద్ర తీరంలో ఉదయం 11.07 గంటలకు గ్రహణం ఏర్పడుతుందని చెప్పారు. మొత్తం 13 రాష్ట్రాల్లో ఇది కన్పించనుంది. దీంతో అమెరికా-కెనడా ప్రజలు పగటిపూటనే సూర్యాస్తమయాన్ని చూడనున్నారు. అయితే ఇండియాలో మాత్రం ఈ సూర్యగ్రహణం కన్పించదు. మన దేశంలో ఈ సంపూర్ణ సూర్య గ్రహణం ప్రభావం ఏం ఉండదని జ్యోతిష్యులు సైతం చెబుతున్నారు.

Updated : 5 Feb 2024 1:58 PM IST
Tags:    
Next Story
Share it
Top