Home > జాతీయం > కేంద్ర మంత్రి పదవి బండికా..బాపురావుకా..?

కేంద్ర మంత్రి పదవి బండికా..బాపురావుకా..?

కేంద్ర మంత్రి పదవి బండికా..బాపురావుకా..?
X

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ నేతల మధ్య మనస్పర్థలు.. దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చేసింది. బండి సంజయ్ ని తప్పించి.. కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా, ఈటల రాజేందర్ ను ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ నియమించింది. అంతేకాకుండా పార్టీ కోసం పనిచేసే మరికొందరు నేతలకు కీలక పదవులు కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్, సోయం బాపురావుల్లో ఎవరికి కేంద్ర మంత్రి పదవి కట్టబెడతారనే రాజకీయ చర్చలు నడుస్తున్నాయి.

ఢిల్లీలోనే ఇద్దరు నేతలు:

కేబినేట్‌ విస్తరణ ఊహాగానాల దృష్ట్యా పార్టీ అధిష్టానం బండి సంజయ్, సోయం బాపురావులకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ పార్టీ ఆఫీసులో ఉన్నారు. ఈ క్రమంలో బాపురావుకు కేబినెట్ సహాయక మంత్రిగా చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి తన సేవలు అందించిన బండికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల్లో ఎవరిని కేంద్ర మంత్రి పదవి వరిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. లేదంటే ఈ ఇద్దరు నేతల్లో ఒకరికి మంత్రి పదవి, మరొకరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసిన బండి సంజయ్ కి మంత్రి వర్గంలో సీటు ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. కేబీనెట్ లో పూర్తి చర్చల ముగిసిన తర్వాత మరి కాసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది.








Updated : 4 July 2023 2:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top