VIRAL VIDEO: పాము కుబుసం వీడడం ఎప్పుడైనా చూశారా?
X
సహజంగా పాములు ఆరు నెలలకు ఒక్కసారి తమ చర్మాన్ని (కుబుసం) విడుస్తాయనే సంగతి తెలిసిందే. సాధారణంగా మనం పంట పోలాల్లో, ఖాళీ స్థలాల్లో పాము కుబుసాన్ని చూస్తూ ఉంటాం. కానీ నేరుగా పాములు కుబుసాన్ని విడిచినప్పుడు చూసిన సందర్భాలు చాలా అరుదు. తాజాగా ఓ పాము తన కుబుసాన్ని విడుస్తూ ఉన్న వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాముకు ఏదైనా గాయాలైన సందర్భంలో లేదా పాత చర్మం ఉడినప్పుడు ఆ ప్రాంతంలో కొత్త చర్మం ఏర్పడుతుంది. ఈ క్రమంలో పాత చర్మాన్ని విడిచిపెట్టడానికి నోటి దగ్గర పాత చర్మానికి పాము ఓ చీలికను ఏర్పరచుకుంటుంది. దీని కోసం గరుకు ప్రదేశంలో కానీ, ఏదైనా రాయి మీద కానీ పాము తన తలను బాగా రుద్దుకుంటుంది. దీంతో పాత చర్మంపై చీలిక వచ్చి పొరలాగా విడిపోతుంది. దీన్నే కుబుసం విడవడం అంటారు. ఆ ప్రక్రియ ఎలా సాగుతుందో మీరు చూడండి.
Skin shedding of King kobra#snake #kobra #shedding pic.twitter.com/EPyykXFw2J
— Science Joy (@InsideOurBodies) January 8, 2024