చలి తీవ్రతతో అయోధ్యకు రాలేకపోతున్న అద్వానీ !
X
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. అయోధ్యలో చలీ తీవ్రత ఎక్కువ ఉండటంతో ఆయన రావట్లేదని బీజేపీ వర్గలు తెలిపాయి. కాగా రామ జన్మభుమి అయిన అయోధ్యలో రాముడి మందిరం నిర్మించడం కోసం అద్వానీ ముందుండి పోరాడారు. లాల్ క్రిష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి. భారతీయ జనతా పార్టీ కురు వృద్ధులు. దశాబ్దాలుగా పార్టీని, పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని పోరాటం చేస్తున్న అత్యంత సీనియర్ నాయకులు. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా ఎన్నో ఆందోళనలు, నిరసనలు.. చివరికి జైలు జీవితం కూడా అనుభవించిన నేతలు. అయోధ్యలో రామాలయం నిర్మించడానికి అద్వానీ చేసిన పోరాటం యావత్ దేశం మరిచిపోలేనిది. అయితే వారు బతికి ఉండగానే అయోధ్యలో దివ్యమైన రామ మందిరం నిర్మితం కావడం వారికి ఎంతో సంతోషాన్నిచ్చేది.
ప్రస్తుతం ఎల్‍కే అద్వానీ వయసు 96 ఏళ్లు కాగా.. మురళీ మనోహర్ జోషి వయసు 89 సంవత్సరాలు. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని అయితే రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావద్దని తాము చేసిన వినతిని వారిద్దరూ అంగీకరించినట్లు చంపత్ రాయ్ శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేశారు. మరోవైపు.. జనవరి 22 వ తేదీన జరిగే ఆలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావాలంటూ మాజీ ప్రధాని, 90 ఏళ్ల దేవెగౌడను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశామని చంపత్ రాయ్ తెలిపారు. అయోధ్య రామమందిరం ఉద్యమానికి ఊపిరులూది.. ఆ ఉద్యమాన్ని ఉప్పెనలా మార్చిన బీజేపీ కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను రామాలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావద్దని సూచించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కలలు కన్న వారిద్దరినీ.. ప్రస్తుతం ఆలయం పూర్తయి.. రాముడు కొలువుదీరే సమయంలో ఆహ్వానించకపోవడం వారిని అవమానించడమేననే వాదనలు వినిపిస్తున్నాయి.