Home > జాతీయం > Ayodhya Ram Mandir : గర్భగుడిలో బాల రాముడు.. కళ్లకు గంతలు ఎందుకంటే..?

Ayodhya Ram Mandir : గర్భగుడిలో బాల రాముడు.. కళ్లకు గంతలు ఎందుకంటే..?

Ayodhya Ram Mandir : గర్భగుడిలో బాల రాముడు.. కళ్లకు గంతలు ఎందుకంటే..?
X

అయోధ్య రామయ్య రామ మందిరానికి చేరుకున్నాడు. మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్ని రామమందిరంలోని గర్భగుడికి చేర్చారు. అయితే రాముడి ముఖం పూర్తిగా కనిపించకుండా కళ్లకు పసుపు రంగు వస్త్రం కట్టారు. ఛాతీ భాగం కనిపించకుండా ధవళ వస్త్రం చుట్టారు. కేవలం నడుం నుంచి కింది భాగం మాత్రమే కనిపిస్తోంది. ఐదేళ్ల బాలరాముడు పద్మంపై నిల్చున్న భంగిమలో ఉన్న విగ్రహం ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయోధ్య రామయ్య రూపాన్ని తొలిసారి చూసి భక్తులు తరించిపోతున్నారు.

ఇదిలా ఉంటే రాముడి కళ్లకు గంతలు ఎందుకు కట్టారన్న సందేహం భక్తులకు కలుగుతోంది. ప్రాణ ప్రతిష్ట రోజునే దాన్ని తొలగించనున్నారు. అప్పటి వరకు భక్తులెవరూ రామయ్య కళ్లలోకి నేరుగా చూడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా చేశారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి దర్శనానికి వెళ్లే భక్తులు దేవుళ్లను భక్తిపారవశ్యాలతో చూస్తారు. కళ్లలో చాలా శక్తి ఉంటుందని, దాని కారణంగానే జీవాత్మ, పరమాత్మల మధ్య ఆధ్యాత్మిక అనుబంధం మరింత బలపడుతుందన్నది విశ్వాసం.

కొన్ని సందర్భాల్లో దేవుడి కళ్లలోకి నేరుగా చూడపం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం దీనికి ఉదాహరణగా చూపుతారు. అక్కడికి వచ్చిన ఓ భక్తుడు భక్తిపారవశ్యంతో తదేకంగా చూడటంతో బాలకృష్ణుడు అనుగ్రహించి ఆయనతో వెళ్లిపోయాడని ఓ కథ ప్రచారంలో ఉంది. అందుకే అక్కడ గర్భగుడిలో దర్శనాల మధ్య పరదా వేస్తుంటారు. దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టించకముందు నరదృష్టి తగలకుండా కళ్లకు గంతలు కడతారని మరికొందరు చెబుతున్నారు. నరదృష్టి చాలా ప్రమాదకరని నమ్ముతారు. అందుకే ఇంటి ముందు దిష్టి బొమ్మలు పెట్టడంలో, దిష్టి తీయడం వెనుక ఉద్దేశం కూడా ఇదే.

అయోధ్య రాముడి కళ్లకు గంతలు కట్టడంలో ఉద్దేశం వేరని పండితులు చెబుతున్నారు. ప్రతిష్టాపన వరకు స్వామిని ఎవరూ చూడకూడదన్న ఉద్దేశంతోనే గంతలు కట్టడం ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు. ప్రాణప్రతిష్టకు ముందు స్వామివారి కళ్ల గంతలు విప్పి అద్దంలో ఆయనకు తన ముఖాన్ని చూపిస్తారు. స్వామి తనను తాను చూసుకున్న తర్వాత ప్రతిష్టాపన పూర్తి చేసి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు.










Updated : 19 Jan 2024 7:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top