Paytm Ban : Paytmపై నిషేధం.. ఆర్బీఐ నిర్ణయంతో ఆ సర్వీసులన్నీ బంద్
X
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) షాకిచ్చింది. కొన్ని సర్వీసులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 29 నుంచి అమల్లోకి రానుంది. పేటీఎం వచ్చే 29వ తేదీ నుంచి కస్టమర్ ఖాతా, ప్రీపెయిడ్ ఇన్ స్ట్రమెంట్స్, వాలెట్స్, ఫాస్ట్ ట్యాగ్ ల్లో డిపాజిట్లు లేదా టాప్ అప్ లను తీసుకోకుండా ఆర్బీఐ నిషేధించింది. ఆర్బీఐకి చెందిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సిస్టమ్ ఆడిట్ నివేదిక, ఎక్స్టర్నల్ ఆడిటర్ కాంప్లయన్స్ వాలిడేషన్ రిపోర్ట్ ఆధారంగా ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని అమలు పరిచింది.
అయితే, సేవింగ్స్ బ్యాంక్ అకౌట్స్, కరెంట్ అకౌట్స్, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్ట్‌ట్యాగ్స్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ వంటి వారి అకౌట్స్ నుంచి కస్టమర్లు తమ బ్యాలెన్స్‌లను విత్ డ్రా చేసుకోవచ్చు. దీంతో పాటు కొత్త కస్టమర్‌లను తీసుకోవడాన్ని నిలిపేయాలని పేటీఎంపై ఆర్బీఐ 2022 మార్చిలో సూచించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం పేటీఎంపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై విచారణ కొనసాగుతుంది.