Home > జాతీయం > బాల రాముని ప్రాణ ప్రతిష్ట.. జనవరి 22న ఎందుకంటే..?

బాల రాముని ప్రాణ ప్రతిష్ట.. జనవరి 22న ఎందుకంటే..?

బాల రాముని ప్రాణ ప్రతిష్ట.. జనవరి 22న ఎందుకంటే..?
X

అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రామమందిర ప్రారంభోత్సవ క్రతువులతో ఆ ప్రాంతమంతా రామ నామ స్మరణతో మారుమోగుతోంది. బుధవారం రామయ్య విగ్రహాన్ని అయోధ్య నగరిలో ఊరేగించనున్నారు. జనవరి 18 నుంచి విగ్రహ ప్రాణ ప్రతిష్ట క్రతువు ప్రారంభంకానుంది.

రామ మందిర ప్రారంభం, ప్రాణ ప్రతిష్ఠ కోసం జనవరి 22ను ఎంచుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి 22 పౌష్య మాసంలోని శుక్లపక్ష ద్వాదశి. ఆ రోజున ఉదయం 8.47 గంటల నుంచి మృగశిర నక్షత్రం, యోగ ఇంద్రయోగం ప్రారంభమవుతుంది. అదే రోజున కర్మ ద్వాదశి కూడా జరుపుకుంటారు.

పురాణాల ప్రకారం కర్మ ద్వాదశి రోజున సాగర మథనం కోసం విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు. అందుకే విష్ణు మూర్తి ఏడో రూపమైన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ అదే రోజున జరపాలని నిర్ణయించారు. జనవరి 22 మధ్యాహ్నం 12.29గంటల నుంచి 12.30 గంటల మధ్య 84 సెకండ్ల వ్యవధిలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ తర్వాత మహాపూజ, మహాహారతి నిర్వహిస్తారు. జోతిష్య శాస్త్ర ప్రకారం జనవరి 22నే సర్వత సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవి యోగం సైతం ఏర్పడనున్నాడు. అందుకే శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ఠకు ఆ రోజును ఎంచుకున్నారని వేద పండితులు చెబుతున్నారు.

Updated : 17 Jan 2024 2:48 PM IST
Tags:    
Next Story
Share it
Top