Home > జాతీయం > పెళ్లయ్యాక భార్య ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు.. హైకోర్టు

పెళ్లయ్యాక భార్య ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు.. హైకోర్టు

పెళ్లయ్యాక భార్య ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు.. హైకోర్టు
X

విడాకులు తీసుకున్న భర్త తనకు భరణం తక్కువగా ఇస్తున్నాడని ఓ మహిళ కోర్టు మెట్లెక్కెంది. మేజిస్ట్రేట్ కోర్టు తనకు ఇచ్చిన భరణంలో కోత విధించడాన్ని సవాలు చేస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆమె భరణం అందుకోదగిన అవసరాలపై ప్రశ్నించింది. మొత్తం మెయింటెనెన్స్ భర్తే ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించింది. ఖాళీగా ఉండకుండా జీవనోపాధి కోసం ఎదైనా పనిచేసుకోమని చెప్పింది. భార్యా బిడ్డలకు భర్త అందించే జీవనభృతిలో కోత విధించడంపై దాఖలైన కేసులో కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె (భార్య) ఇప్పుడు ఎందుకు పని చేయలేకపోతుందో తెలపాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది.

మేజిస్ట్రేట్ కోర్టు తనకు ఇచ్చిన భరణంలో కోత విధించడాన్ని సవాలు చేస్తూ భార్య ఈ పిటిషన్ దాఖలు చేసింది. సెషన్స్ కోర్టు (అప్పిలేట్ కోర్టు) దాఖలు చేసిన ఉత్తర్వుల ప్రకారం.. భరణం రూ .10,000 నుండి రూ .5,000 కు, పరిహారాన్ని రూ .3 లక్షల నుండి రూ .2 లక్షలకు తగ్గించారు. అయితే ఆమెకు మంజూరు చేసిన పరిహారం సరిపోదని పిటిషనర్ వాదించారు. సరైన సాకు లేకుండా సెషన్స్ కోర్టు భరణాన్ని తగ్గించిందని ఆమె ఆరోపించారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ రాజేంద్ర బాదామికర్ తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్.. వివాహానంతరం భార్య ఎందుకు పనిచేయలేకపోయిందో సరైన వివరణ లేదని పేర్కొంది. ‘‘పెళ్లికి ముందు భార్య ఉద్యోగం చేస్తూ సంపాదించేంది. ఆమె ఖాళీగా కూర్చోకూడదు(Wife Cannot Sit Idle). తన భర్త నుంచి మొత్తం మెయింటెనెన్స్ కోరరాదు. తన జీవనోపాధి కోసం కొన్ని ప్రయత్నాలు చేయడానికి ఆమె చట్టబద్ధంగా కట్టుబడి ఉంది. కనుక ఆమె తన భర్త నుండి సహాయక భరణాన్ని(Supportive Maintenanc) మాత్రమే కోరవచ్చు’’ అని హైకోర్టు పేర్కొంది. కాగా.. అత్తగారితో, సోదరితో ఉండేందుకు భార్య సుముఖంగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తల్లి, సోదరి సంరక్షణ బాధ్యత భర్తపై ఉంటుందని పేర్కొంటూ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.




Updated : 5 July 2023 12:15 PM IST
Tags:    
Next Story
Share it
Top