Home > జాతీయం > Wife Sells Husband: భర్తను 5 లక్షలకు అమ్మేసిన భార్య.. ట్విస్టులు మామూలుగా లేవు..

Wife Sells Husband: భర్తను 5 లక్షలకు అమ్మేసిన భార్య.. ట్విస్టులు మామూలుగా లేవు..

Wife Sells Husband: భర్తను 5 లక్షలకు అమ్మేసిన భార్య.. ట్విస్టులు మామూలుగా లేవు..
X

కర్నాటకలో జగపతిబాబు శుభలగ్నం మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఆ సినిమాలో జగపతిని ఆమని కోటీ రూపాయలకు అమ్మేస్తోంది. ఇక్కడ కూడా ఓ మహిళా 5లక్షలకు తన భర్తను ఆయన లవర్కే అమ్మేసింది. మాండ్య సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. జగన్నాథ్ అనే వ్యక్తి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్య అమలకు తెలిసింది. ఓ రోజు తన భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.

ఈ వ్యవహారం కాస్త పెద్దల పంచాయతీ దాకా వెళ్లింది. జగన్నాథ్ తన దగ్గర 5 లక్షలు తీసుకున్నాడని.. ఆ డబ్బిచ్చి అతడిని తీసుకెళ్లాలని సదరు మహిళ అమలతో తేల్చి చెప్పింది. అయితే తనకు 5లక్షలు ఇచ్చి తన భర్తను తీసుకోమని భార్య ఆఫర్ ఇచ్చింది. దీనికి భర్త లవర్ సైతం ఒప్పుకుంది. ఒక నెల టైం ఇస్తే 5లక్షలు ఇస్తానని చెప్పింది. దీంతో తన భర్తను 5లక్షలకు అమ్మేసింది. దీనిపై పంచాయతీ పెద్దలు భార్యను నిలదీయగా.. ఇటువంటి భర్తను 5లక్షలు కట్టి తీసుకెళ్లిన తర్వాత తిరిగి ఆమె దగ్గరకు వెళ్లడని గ్యారెంటీ ఏంటని అమల ప్రశ్నించింది. దీంతో పంచాయతీ పెద్దలు అవాక్కయ్యారు.

Updated : 21 Oct 2023 1:33 PM IST
Tags:    
Next Story
Share it
Top