Home > జాతీయం > Mandakrishna Madiga : మందకృష్ణ సపోర్ట్ ఇస్తే సరిపోతుందా..? ఎమ్మార్పీఎస్ ఎటువైపు?

Mandakrishna Madiga : మందకృష్ణ సపోర్ట్ ఇస్తే సరిపోతుందా..? ఎమ్మార్పీఎస్ ఎటువైపు?

Mandakrishna Madiga : మందకృష్ణ సపోర్ట్ ఇస్తే సరిపోతుందా..? ఎమ్మార్పీఎస్ ఎటువైపు?
X

బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మాదిగ విశ్వరూప సభలో ప్రధాని మోదీతో పాటు.. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సభలో దశాబ్దాలుగా తేలని ఎస్సీ వర్గీకరణపై మోదీ కీలక ప్రకటన చేశారు. వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, దీనికోసం త్వరలోనే కమిటీ వేస్తామని చెప్పారు. వర్గీకరణ అమలు చేయలేకపోయినందుకు అన్ని రాజకీయ పార్టీల తరుపున తాను క్షమానణ కోరుతున్నట్లు చెప్పారు. కాగా ఈ విషయంపై దళిత వర్గాలు మందకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీకి ఎస్సీ వర్గంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇన్నేళ్లలో వర్గీకరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నిస్తున్నారు. మొదటిసారి అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చినా ఈరోజు వరకు కార్యరూపం దాల్చలేదని మండిపడుతున్నారు. సంక్లిష్టమైన కశ్మీర్ సమస్యను పరిష్కరించారు. ఈబీసీ వర్గానికి రిజర్వేషన్ కల్పించిన మోదీ మాదిగలను పట్టించుకోలేదని అంటున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో దళితుల ఓట్లు కీలకమైన నేపథ్యంలో.. మెజారిటీ జనాభా మాదిగలే ఉన్నారు. వారి ఓటు బ్యాంకు దక్కించుకునేందుకుర ప్రధాన పార్టీలు అన్నివిధాల ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే దళిత బంధు పథకంతో ఆదుకుంటామని చెప్పగా.. బీజేపీ ఎస్సీ వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చింది. అందుకే మందకృష్ణ మాదిగను ప్రచార బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తుంది. మందకృష్ణ మాదిగతో పాటు, ఎస్సీ రిజర్వ్డ్, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలంతా బీజేపీకే ఓటేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బీజేపీకి కొంత బలం చేకూరింది. ఎస్సీ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం చేకూరే అవకాశం ఉంది. అయితే పలువురు ఎమ్మార్పీఎస్ నేతల నుంచి బీజేపీకి వ్యతిరేకత ఉంది. ఎస్సీ వర్గీకరణ పూర్తిగా సుప్రీం కోర్టు పరిధిలో ఉంటుందని, ఎన్నికల ముందు అది సాధ్యపడదని, ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ హామీ పూర్తిగా నీరుగారి పోతుందని ఆరోపింస్తున్నారు. మనువాద సిద్దాంతానికి కట్టుబడి ఉండే బీజేపీకి చాలామంది మాదిగలు పూర్తిగా వ్యతిరేకం. ఈ క్రమంలో బీజేపీకి ఎస్సీ వర్గీకరణ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.




Updated : 20 Nov 2023 11:30 AM IST
Tags:    
Next Story
Share it
Top