దేశం పేరు మార్పుపై 'ఇండియా' కూటమి నేతల ఆగ్రహం
X
జీ-20 సదస్సుకు హాజరయ్యే అతిథులకు రాజ్ భవన్ పంపిన ఇన్విటేషన్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాయడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 28 పార్టీల విపక్ష పార్టీల కూటమి పేరు ఇండియా కావడంతో మోడీ సర్కారు దేశం పేరు మార్చే ప్రయత్నం చేస్తోందని కూటమి నేతలు మండి పడుతున్నారు. ఈ క్రమంలో పేరు మార్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు.
పేరు మార్పుకు సంబంధించి తనకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని కేజ్రీవాల్ అన్నారు. విపక్ష పార్టీలు కూటమి పేరు ఇండియా అని పెట్టుకున్నందుకు దేశం పేరును మార్చాలని కేంద్రం అనుకుంటున్నదా అని ప్రశ్నించారు. ఈ దేశం ఏ ఒక్క పార్టీదో కాదని, 140కోట్ల మంది ప్రజలదని అన్నారు. విపక్ష కూటమి పేరు I.N.D.I.A.ను భారత్ అని మార్చితే అప్పుడు భారత్ పేరును బీజేపీ అని మార్చుకుంటారా? అని కేజ్రీవాల్ నిలదీశారు.
దేశం పేరు మార్పు అంశంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సైతం స్పందించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘ఇండియా పేరును భారత్గా మార్చడంపై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ‘దేశం పేరుపై అధికార పార్టీ ఎందుకంత కలవరపడుతుందో అర్థం కావడం లేదని అన్నారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని, ఎవరూ దాన్ని మార్చలేరని తేల్చిచెప్పారు.
INDIA गठबंधन से ये लोग इतना बौखलाए हुए हैं कि देश का नाम तक बदल देंगे? अगर कल हमने अपने गठबंधन का नाम “भारत” रख लिया तो क्या “भारत” नाम भी बदल देंगे? pic.twitter.com/LS8ECPlNmF
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 5, 2023