Home > జాతీయం > ఫోన్ కోసం టీచర్ ను రోడ్డు మీద ఈడ్చుకెళ్ళిన దొంగలు

ఫోన్ కోసం టీచర్ ను రోడ్డు మీద ఈడ్చుకెళ్ళిన దొంగలు

ఫోన్ కోసం టీచర్ ను రోడ్డు మీద ఈడ్చుకెళ్ళిన దొంగలు
X

తమకు కావల్సిన దానికోసం దేనికైనా తెగిస్తారు కొంతమంది. ఇలాగే ఢిల్లీలో రెచ్చిపోయారు దుండగులు. ఆటోలో వెళుతున్న మహిళా టీచర్ దగ్గర ఐఫోన్ తీసుకోవడానికి ప్రయత్నించి...ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఢిల్లీలోని సాకేత్ లో జరిగిందీ ఈ ఘటన.

ఆటోలో వెళుతున్న మహిళా టీచర్ దగ్గర ఐఫోన్ ఉంది. దాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు బైక్ దొంగలు. ఈ క్రమంలో ఆమె కిందపడిపోయింది. అయినా కూడా వాళ్ళు కనికరించలేదు. పడిపోయిన టీచర్ ను చాలా దూరం లాక్కెళ్ళారు. అలా కొంత దూరం వెళ్ళాక దుండగులతో పోరాడలేక ఆమె ఫోన్ వదిలేశారు. దాంతో అక్కడి నుంచి వాళ్ళు ఉడాయించారు. దాని తర్వాత ఆ దారిన వెళుతున్నవారు టీచర్ ను ఆసుపత్రిలో జాయిన్ చేశారు.





ఆటోలో నుంచి కిందపడిపోవడంతో తన తలకు బాగా గాయాలయ్యాయి అని చెబుతున్నారు టీచర్. నేను నా ఫోన్ కోసం చాలాసేపు పోరాడాను. కిందపడి నాకు దెబ్బలు తగిలినా వాళ్ళు విడిచిపెట్టలేదు. చాలా దూరం లాక్కెళ్ళారు. దుండుగులు పారిపోయారు. పోలీసులు కంప్లైంట్ నోట్ చేసుకున్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. నా ఫోన్ కూడా ట్రాక్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Updated : 14 Aug 2023 6:32 PM IST
Tags:    
Next Story
Share it
Top