Home > జాతీయం > Skydiving: జైశ్రీరాం జెండాతో 13వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్

Skydiving: జైశ్రీరాం జెండాతో 13వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్

Skydiving: జైశ్రీరాం జెండాతో 13వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్
X

అయోధ్యాపురిలోని శ్రీరామమందిరం (Sri Rama Mandir)ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం కోసం సిద్ధమవుతుంది. రామాలయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ తో సహా 4,000మందికిపైగా వీఐపీలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మహత్తర వేడుకకు ముందు అయోధ్యను అందంగా అలంకరిస్తున్నారు. నగరంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ కు చెందిన 22ఏళ్ల యువతి బ్యాంకాక్ లో 13వేల అడుగుల ఎత్తులో నుంచి జై శ్రీరామ్ అని రాసి ఉన్న జెండాతో స్కైడైవింగ్(Skydiving) చేస్తూ అయోధ్యలోని రామమందిరంపై ఉన్న తన భక్తిని ప్రదర్శించింది. అనామిక శర్మ అనే 22 ఏళ్ల యువతి జనవరి 22న రామమందిర ప్రాంభోత్సవానికి ముందు ఈ స్టంట్ ప్రదర్శించింది. నేను నా మతాన్ని ప్రేమిస్తాను..నా మతాన్ని స్కైడైవింగ్ ను కలిసి ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను అంటూ అనామిక శర్మ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




Updated : 5 Jan 2024 3:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top