కుక్క పోస్టర్ తొలగించాడని వ్యక్తి జుట్టు పట్టుకొని కొట్టిన మహిళ
X
కుక్క పోస్టర్ తొలగించినందుకు ఓ మహిళ రెచ్చిపోయింది. హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ పై దాడి చేసింది. ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నోయిడా సెక్టార్ 75లోని ఎయిమ్స్ గోల్ఫ్ అవెన్యూ సొసైటీలో ఆషి సింగ్ నివసిస్తోంది. ఆమె పెంపుడు కుక్క ఒకటి ఇటీవలే తప్పిపోయింది. దీంతో కుక్క మిస్సింగ్ పోస్టర్‌ను సొసైటీ ఆవరణలో అంటించారు. అయితే సొసైటీ ప్రెసిడెంట్ నవీన్ మిశ్రా ఆ పోస్టర్ తొలగించాడు. ఆ విషయం తెలుసుకున్న ఆషి సింగ్ కోపంతో ఊగిపోయింది. నవీన్ కాలర్ పట్టుకుని పోస్టర్ ఎందుకు తొలగించావని నిలదీసింది.
నవీన్ విడిపించుకునే ప్రయత్నం చేసినా ఆషి సింగ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. కాలర్ వదలి మర్యాదగా మాట్లాడమని అతను చెప్పడంతో ఆమె మరింత రెచ్చిపోయింది. నవీన్ జుట్టుపట్టుకుని అతని చెంపలు వాయించింది. ఆషి సింగ్ వెంట ఉన్న మరో వ్యక్తి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్న నవీన్ చేయి పట్టుకుని ఆమెకు సహకరించాడు. గొడవ విషయం తెలిసి అక్కడకు చేరుకున్న కొందరు జోక్యం చేసుకుని విడిపించారు.
దాడికి సంబంధించి నవీన్ మిశ్రా పోలీసులకు కంప్లైట్ చేశాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.
नोएडा में कुत्ता प्रेमी महिला की गुंडागर्दी। सोसाइटी में कुत्ते का पोस्टर हटाने पर एक आदमी से की मारपीट।pic.twitter.com/3RXj1MLOHj
— Kapil (@kapsology) September 23, 2023