Home > జాతీయం > ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు!

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు!

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు!
X

సెప్టెంబర్ 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ సోమవారం (సెప్టెంబర్ 4) రాజస్థాన్, జైపూర్ లోని విశ్వవిద్యాలయ మహారాణి మహావిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దీని గురించి సంకేతాలిచ్చారు. 2047 కన్నా ముందే దేశం అభివృద్ధి చెందాలంటే.. పార్లమెంట్, శాసన సభల్లో మహిళల కోసం ప్రత్యేక రిజర్వేషన్ బిల్లును కల్పించాలని అన్నారు.





విద్యార్థులనుద్దేశించిన మాట్లాడిన ఆయన.. 2047 కన్నా ముందే మనం నంబర్ వన్ స్థానానికి చేరుకుంటామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ చాలా ముఖ్యమైనదని, మన రాజ్యాంగం.. పంచాయితీలు, నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషర్లు కల్పింస్తుందని చెప్పారు.




Updated : 5 Sept 2023 4:06 PM IST
Tags:    
Next Story
Share it
Top