Independence day 2023 : దేశాన్ని నడిపిస్తున్నది మహిళలే.. ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ
X
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోదీ. అనంతరం దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంతో దేశంలో మహిళల పాత్ర.. వారి నేతృత్వంలోని జరిగిన అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. చంద్రయాన్ మిషన్‌కు మహిళలు నాయకత్వం వహిస్తున్నారన్న విషయాన్ని చెబుతూ.. "మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నది మహిళల నేతృత్వంలోని అభివృద్ధే. నేడు, పౌర విమానయాన రంగంలో అత్యధిక పైలట్‌లను కలిగి ఉన్న దేశం మన భారతదేశం. ఈ విషయాన్ని సగర్వంగా చెప్పగలం. మహిళా శాస్త్రవేత్తలు చంద్రయాన్ మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను G20 దేశాలు కూడా గుర్తిస్తున్నాయి" అని ప్రధాని మోదీ అన్నారు.
‘‘జీ20 సమావేశాలు ప్రపంచానికి కొత్త భారతాన్ని పరిచయం చేశాయి. మన ఎగుమతులు కొత్త లక్ష్యాలను చేరుకుంటున్నాయి. కరోనా తర్వాత భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది. మారుతున్న ప్రపంచంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది. దేశమే ప్రథమమన్న పురోగామి ఆలోచనలతో జాతి ముందడుగు వేస్తోంది. బలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడే సంస్కరణలు సాధ్యం. ప్రతి సంస్కరణా జన క్షేమాన్ని కాంక్షించే జరుగుతున్నాయి. సత్తాచాటు, మార్పు చెందు అన్న పద్ధతిలో దేశం ముందడుగు వేస్తోంది" అని అన్నారు.
చంద్రయాన్-3 ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. అమెరికా, రష్యా, చైనాల సరసన చేరి, ఈ ఘనత సాధించిన ప్రపంచంలో నాలుగో దేశంగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.