Home > జాతీయం > లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు..! క్రెడిటంతా మాదేనన్న సోనియా

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు..! క్రెడిటంతా మాదేనన్న సోనియా

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు..! క్రెడిటంతా మాదేనన్న సోనియా
X

దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకూ మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ఈ బిల్లును ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును సభ ముందు ఉంచే అవకాశముంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం సభలో చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించి బిల్లుకు ఆమోద ముద్ర వేసే అవకాశముంది. మరోవైపు సెప్టెంబర్ 21 గురువారం రాజ్యసభ ముందుకు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు రానున్నట్లు సమాచారం. అదే రోజున చర్చతో పాటు బిల్లుకు పెద్దల సభ ఆమోద ముద్ర వేసే ఛాన్సుంది.

ఇదిలా ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్నారన్న వార్తలపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించారు. పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్దేనని చెప్పారు. ఇక మంగళవారం కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే అది కాంగ్రెస్, యూపీఏ భాగస్వామ్యపక్షాల విజయం అవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం అభిప్రాయపడ్డారు. వాస్తవానికి యూపీఏ హయాంలోనే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది. 2010 మార్చి 9న బిల్లు రాజ్యసభ ఆమోదం పొందగా.. లోక్ సభలో మాత్రం దానిపై చర్చ జరగలేదు. దీంతో మహిళా బిల్లు కథ మళ్లీ మొదటికొచ్చింది.




Updated : 19 Sep 2023 6:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top