Home > జాతీయం > కేంద్ర మంత్రితో రెజ్లర్ల భేటీ.. నిరసనలకు తాత్కాలిక బ్రేక్.. కారణం అదేనా..?

కేంద్ర మంత్రితో రెజ్లర్ల భేటీ.. నిరసనలకు తాత్కాలిక బ్రేక్.. కారణం అదేనా..?

కేంద్ర మంత్రితో రెజ్లర్ల భేటీ.. నిరసనలకు తాత్కాలిక బ్రేక్.. కారణం అదేనా..?
X

కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో రెజ్లర్లు భజరంగ్ పునియా, సాక్షి మాలిక్ భేటీ అయ్యారు. రెజ్లర్ల సమస్యపై చర్చించేందుకు సిద్ధమంటూ అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేయడంతో భజరంగ్ పునియా, సాక్షి మాలిక్ లు ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అనురాగ్ ఠాకూర్.. రెజ్లర్లు తన ముందు ఉంచి డిమాండ్ లకు స్పందించి, లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్లు తెలిపారు.

భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన భజరంగ్ పునియా.. పలు అంశాలపై మంత్రితో చర్చించినట్లు తెలిపారు. బ్రిజ్ భూషన్ పై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ఈ నెల 15తో ముగుస్తుందని.. అప్పటివరకు రెజ్లర్ల నిరసనలు ఆపాలని అనురాగ్ తమను కోరినట్లు చెప్పుకొచ్చారు. మహిళా రెజ్లర్ల భద్రత కూడా తామే చూసుకుంటామని అనురాగ్ హామీ ఇచ్చారట.

మే 28న ఆందోళన చేపట్టిన రెజ్లర్లపై పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. వాటిని తొలగించాలని రెజ్లర్లు డిమాండ్ చేయగా, దానికి మంత్రి అంగీకరించాడు. ఈ నేపథ్యంలో తమ నిరసనలను జూన్ 15 వరకు నిలిపివేస్తున్నట్లు భజరంగ్ పునియా తెలిపాడు. ఈ నెల 15 తర్వాత వెలువడే కేసు తీర్పుపై.. తమ పోరాటం ఆధారపడి ఉందని అన్నారు. ఆ తర్వాత మాట్లాడిన అనురాగ్.. భారత రెజ్లింగ్ సమాఖ్యకు జూన్ 30 లోపు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.


Updated : 7 Jun 2023 3:57 PM GMT
Tags:    
Next Story
Share it
Top