Home > జాతీయం > ఒడిశా రైలు ప్రమాదానికి కారణం ఇదే..సేఫ్టీ కమిషన్ నివేదిక

ఒడిశా రైలు ప్రమాదానికి కారణం ఇదే..సేఫ్టీ కమిషన్ నివేదిక

ఒడిశా రైలు ప్రమాదానికి కారణం ఇదే..సేఫ్టీ కమిషన్ నివేదిక
X

ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగి నెల రోజులు కావస్తోంది. మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న ఈ భారీ ప్రమాదంలో దాదాపు 291 మంది ప్రయాణికులు మృతిచెందారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. దేశంలోనే అతి పెద్ద రైలు ప్రమాదంగా ఈ దుర్ఘటన నిలిచింది. ఈ క్రమంలో ఈ ప్రమాదాన్ని సీరియస్‎గా తీసుకున్న కేంద్ర సర్కార్ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. దాదాపు నెల రోజుల పాటు విచారణ చేసిన సేఫ్టీ కమిషన్‌ తాజాగా ప్రమాదానికి గల కారణాన్ని వెల్లడించింది. ట్రిపుల్ రైలు ప్రమాదం వెనుక "రాంగ్ సిగ్నలింగ్" ప్రధాన కారణమని నివేదికను సమర్పించింది. అదే విధంగా 2022 మే నెలలో ఖరగ్‌పూర్ డివిజన్‌లోని స్టేషన్‌లో ఇలాంటి సంఘటన జరిగిందని.. అప్పుడే అధికారులు అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు తీసుకుని ఉండినట్లయితే.. ఇంతటి ఘోర ప్రమాదం జరిగుండేది కాదని కమిటీ తమ నివేదికలో తెలిపింది.





రాంగ్‌ వైరింగ్‌, సిగ్నలింగ్‌, సర్క్యూట్‌లో లోపాలే ఒడిశా రైలు ప్రమాదానికి కారణమని కమిషన్‌ నివేదికలో తెలిపింది. ప్రమాదం జరిగిన సైట్‌లో కంప్లీషన్‌ సిగ్నలింగ్‌ వైరింగ్‌ రేఖా చిత్రాలు, ఇతర డాక్యుమెంట్‌లు, సిగ్నలింగ్‌ సర్క్యూట్‌ల అక్షరాలను అప్‌డేట్ చేసేందుకు ఓ డ్రైవ్‌ను స్టార్ట్ చేయాలని కమిటీ సూచించింది. మార్పు కోసం ప్రామాణిక పద్ధతులను ఫాలో అవ్వాలని తెలిపింది. అంతే కాదు సిగ్నలింగ్ సర్క్యూట్‌లు, వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు స్పెషల్ టీమ్‎ను అపాయింట్ చేయాలని సూచించింది.





ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా స్పందించే విధంగా జోనల్ రైల్వేల్లో విపత్తు ప్రతి స్పందన వ్యవస్థను సమీక్షించాలని నిపుణుల కమిటీ సూచించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ వంటి విపత్తు ప్రతిస్పందన దళాల మధ్య కో‎ఆర్డినేషన్‎ను సమీక్షించాలని రైల్వేలకు నివేదిక తెలిపింది.






Updated : 4 July 2023 8:46 AM IST
Tags:    
Next Story
Share it
Top