Home > జాతీయం > మళ్లీ మహోగ్ర రూపం దాల్చిన యమునా నది..

మళ్లీ మహోగ్ర రూపం దాల్చిన యమునా నది..

మళ్లీ మహోగ్ర రూపం దాల్చిన యమునా నది..
X

యమునా నది మరోసారి మహోగ్రరూపం దాల్చింది. ఉత్తరాదిన కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఢిల్లీలోనూ కుండపోత వాన పడుతుండటం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో యమునా నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది.

ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా హర్యానాలోని హత్నికుండ్‌ బరాజ్‌నుంచి అధికారులు 2 లక్షలకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో దిగువన ఉన్న ఢిల్లీకి వరద పోటెత్తడంతో యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

యమునా నదికి వరద పోటెత్తుతుండటంతో కేజ్రీవాల్ సర్కారు ముంపు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారికి అవసరమైన సాయం అందిస్తోంది.




Updated : 23 July 2023 4:14 PM IST
Tags:    
Next Story
Share it
Top