Home > జాతీయం > తాజ్‌మహల్‌ను తాకిన వరద.. 45 ఏళ్లలో ఇదే తొలిసారి..

తాజ్‌మహల్‌ను తాకిన వరద.. 45 ఏళ్లలో ఇదే తొలిసారి..

తాజ్‌మహల్‌ను తాకిన వరద.. 45 ఏళ్లలో ఇదే తొలిసారి..
X

ఎడతెరిపి లేని వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యమునా నది మహోగ్ర రూపం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్ మహల్ పరిసరాల్లోకి వరద చేరింది. తాజ్‌మహల్ గార్డెన్‌లో భారీగా వరదనీరు నిలిచింది.

1978లో అధిక వరదల సమయంలో యమునా నది తాజ్ మహల్ లోకి వరద నీరు చేరింది. దాదాపు 508 అడుగుల ఎత్తులో యమునా నది ప్రవహించడంతో తాజ్‌మహల్‌ బేస్‌మెంట్‌లోని 22 గదుల్లోకి వరద నీరు ప్రవేశించింది. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో కాకున్నా తాజ్ మహల్ గోడలను వరద నీరు తాకింది. అయితే ఈ వరదనీరు వల్ల తాజ్‌మహల్‌కు వచ్చిన ముప్పేమీ లేదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రకటించింది.

వారం రోజులుగా వరద గుప్పిట్లోనే ఉన్న ఢిల్లీ నగరం.. వర్షాలు తగ్గకపోవడంతో ఇప్పట్లో జల దిగ్బంధనం నుంచి బయటపడే పరిస్థితులు కనిపించడంలేదు. దేశ రాజధానిలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. ఐపీ ఫ్లైఓవర్ వద్ద డ్రెయిన్ పొంగిపొర్లుతోంది. దాంతో రాజ్ ఘాట్ నుంచి నిజాముద్దీన్ వరకు మురికినీటితో నిండిపోగా, ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.

Yamuna flood water touch Taj Mahal walls for first time in 45 years

Taj Mahal,agra,yamuna floods,yamuna water,delhi,himachal pradesh,heavy rains

Updated : 18 July 2023 9:05 PM IST
Tags:    
Next Story
Share it
Top