యుమునా నది డేంజర్ బెల్స్.. ఢిల్లీ సీఎం ఇంటి వరకు వరద నీరు
X
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం అవుతోంది. దాంతో యమునా నది మహోఉగ్రరూపం దాల్చింది. దేశ రాజధాని ఢిల్లీని ఆ వరద నీరు తాకింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల వల్ల ఎగువ నీరు కిందికి విడుదల చేయడంతో ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జ్ వద్ద యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పెరిగింది. గురువారం ఉదయానికల్లా నది నీటి మట్టం 208.51 మీటర్లకు చేరింది. చరిత్రలో మొదటి సారి యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి 3 మీటర్లపైకి ప్రవహిస్తోంది. హత్నీకుండ్ నుంచి హరియాణాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
దాంతో నీటి మట్టం మరింత పెరిగే చాన్స్ ఉందని కేంద్ర జల కమిషన్ అంచనా వేస్తుంది. నీటి మట్టం మరింత పెరిగితే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించింది. వరద నీరు ఢీల్లీ అంతటా చేరిపోయాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సివిల్ లైన్స్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పూర్తిగా నీట మునిగింది. కశ్మీరీ గేట్- మంజు కా తిలాని కలిపే ప్రాంతాల్లో వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఇళ్లు, ఢిల్లీ అసెంబ్లీ ఉంటాయి.