Home > జాతీయం > యోగి తలుచుకుంటే ఫ్రాన్స్‌లో అల్లర్లు బంద్..!!!!

యోగి తలుచుకుంటే ఫ్రాన్స్‌లో అల్లర్లు బంద్..!!!!

యోగి తలుచుకుంటే ఫ్రాన్స్‌లో అల్లర్లు బంద్..!!!!
X

టైటిల్ చూసి ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రికి, ఫ్రాన్స్‌లో జరిగే అల్లర్లకు సంబంధమేంటని అనుకుంటున్నారా..? అదే ట్విస్ట్. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరిగే అల్లర్లను అరికట్టాలంటే.. అందుకు ఒకే ఒక్క మొనగాడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అట. యోగిని.. ఫ్రాన్స్ కి పంపిస్తే.. దెబ్బకు అల్లర్లు బంద్ అవుతాయని జర్మనీకి చెందిన ప్రొఫెసర్‌, కార్డియాలజిస్టు ఎన్‌.జాన్‌ కామ్‌ ట్వీట్ చేశారని.. సీఎం సిబ్బంది తొందరపడింది. ఆ ట్వీట్ లో ఫ్రాన్స్ అల్లర్లను యోగి 24 గంటల్లో కట్టడి చేయగలరని ఉండగా.. యోగీ సీఎంవో కు ఎక్కడ లేని ఆనందమేసింది. ఆ ట్వీట్ కు రీట్వీట్ చేస్తూ.. ‘‘ప్రపంచంలో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగినా.. యూపీలో నేరస్థులపై ఉక్కుపాదం మోపే యోగి మోడల్‌ను అనుసరించాలి. దాంతోనే అల్లర్లను కట్టడి చేయవచ్చు’’ అని ట్వీట్‌ చేసింది.

జర్మనీ కి చెందిన ప్రొఫెసర్ .. ఫ్రాన్స్ అల్లర్ల గురించి యోగిని రికమండ్ చేయడం.. నెటిజన్లకు కొంచెం అనుమానంగా తోచింది. కాస్త గూగుల్ సెర్చ్ చేసి చూడగా.. సదరు జాన్‌ కామ్‌ ట్విటర్‌ అకౌంట్ నకిలీదని తెలిసింది. ఆ అకౌంట్ చీటింగ్‌ కేసులో అరెస్టైన డాక్టర్‌ నరేంద్ర విక్రమాదిత్య యాదవ్‌కు చెందినదని కామెంట్లు చేశారు. మరోవైపు ఆ ట్వీట్‌పై యోగి ఆదిత్యనాథ్‌ కార్యాలయం స్పందించడంపై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సెటైర్లు వేశారు. విదేశీయుల ప్రశంసల కోసం బీజేపీ తహతహలాడుతోందన్నారు. ట్వీట్‌ చేసిన వ్యక్తి ట్విటర్‌ ఖాతా నకిలీదని కూడా గమనించలేదని ఎద్దేవా చేశారు.

Updated : 2 July 2023 9:38 AM IST
Tags:    
Next Story
Share it
Top