సీఎం మాట్లాడుతుండగా.. దూసుకొచ్చిన యువకుడు
X
బీహార్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పట్నాలోని గాంధీ మైదాన్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గోన్న సీఎం నితీశ్ కుమార్ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్టేజ్ పై ప్రసంగిస్తుండగా.. ఓ యువకుడు ఆయనపై దూసుకొచ్చాడు. సీఎం హై సెక్యూరిటీ జోన్ ను దాటుకుని స్టేజ్ వైపు పరిగెత్తాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్నవాళ్లంతా ఉలిక్కిపడ్డారు. అసలేం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు.
ఆ యువకుడు తనకు ఉద్యోగం కావాలని పోస్టర్ లో రాసుకుని.. దాన్ని సీఎంకు చూపిస్తూ స్టేజ్ వైపు దూసుకెళ్లాడు. అనంతరం అతన్ని విచారించగా.. ముంగేర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల నితీశ్ కుమార్ గా గుర్తించారు. బిహార్ మిలిటరీ పోలీస్ విభాగంలో పనిచేస్తూ నితీశ్ తండ్రి రాజేశ్వర్ పాసవాన్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ సీఎంను కలిసేందుకు అక్కడికి వచ్చాడు. కాగా ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Independence Day 2023: स्वतंत्रता दिवस समारोह में सीएम नीतीश की सुरक्षा में चूक
— Sadan Jee (@SadanJee) August 15, 2023
आक्रोशित युवक ने मंच के निकट पहुंच कर जताया विरोध
बाद में सुरक्षा कर्मी युवक को अपने साथ ले गए. #स्वतंत्रता_दिवस #BiharPolice #Bihar #IndependenceDay2023 #Patna #IndependenceDay #NitishKumar pic.twitter.com/fYmZU845BY