Home > జాతీయం > మెట్రోలో అమ్మాయిల క్యాట్ వాక్...అవాక్కైన ప్రయాణికులు

మెట్రోలో అమ్మాయిల క్యాట్ వాక్...అవాక్కైన ప్రయాణికులు

మెట్రోలో అమ్మాయిల క్యాట్ వాక్...అవాక్కైన ప్రయాణికులు
X

మెట్రో రైళ్లల్లో చోటు చేసుకునే కొన్ని వింతైన సంఘటనలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముంబై , ఢిల్లీ వంటి మహానగరాల్లోని మెట్రో స్టేషన్లు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. మహిళలు ప్రమాదకరంగా ట్రైన్లలో ప్రయాణించడం, యూత్ రీల్స్ వైరల్ అయ్యేందుకు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, బోగీల్లో పిచ్చి పిచ్చి డాన్సులు చేయడం వంటి వీడియోలు ఈ మధ్యకాలంలో చాలానే నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే లేటెస్టుగా ఓ మెట్రో ట్రైన్‎లో అమ్మాయిలు చేసిన పనికి నెటిజన్స్ ఒకింత షాక్‎కి గురయ్యారు.




మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఈ మధ్యనే ఓ స్కీమ్‎ను అందుబాటులోకీ తీసుకువచ్చింది. ‘‘సెలబ్రేషన్ ఆన్ వీల్స్’’..అనే పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎలాంటి శుభకార్యాలు ఉన్నా, స్కూల్ పంక్షన్లు అయినా సరే మెట్రో రైలు బోగీలను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. అందుకోసం అవసరమైన సొమ్ము చెల్లిస్తే చాలు రైలులోనే రకాల కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. ఈ పథకం బాగా ఫేమస్ కావడంతో అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది యువతులు అంతా కలిసి రైలు బోగీలో ఫ్యాషన్ షో నిర్వహించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.





కొంత మంది యువతులు, మహిళలు అందమైన దస్తులు ధరించి వయ్యారంగా నడుస్తున్న మోట్రో రైలులో క్యాట్ వాక్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది వరకు స్టేజీల మీద జరిగే ఫ్యాషన్ షోకు భిన్నంగా ఇలా యువతులు ట్రెండ్ సెట్ చేశారు. ఒకరి తరువాత ఒకరు వయ్యారంగా రైలు బోగీల్లో నడుస్తూ ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. రకరకాల రంగుల డ్రస్సులతో అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. అమ్మాయిల అందాల క్యాట్ వాక్ చూసి ఫిదా అయిన వారు వారి ఫోన్లలో యువతులను ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.అవే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా తమ స్పందనను తెలియజేస్తున్నారు.



Updated : 29 Aug 2023 12:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top