రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. 'మీ బెర్త్ మరొకరికి కేటాయిస్తాం'
X
రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఇకపై మీరు రిజర్వేషన్ చేయించుకున్న ప్రకారం... ఎక్కవలసిన స్టేషన్లో కాకుండా , ఆ తర్వాతి స్టేషన్లో రైలు ఎక్కి ఇది నా సీటు అంటే ఇకపై కుదరదు. వేరేవారికి ఆ బెర్త్ ఇతరులకు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించే హక్కు ఉండదు. ఇందుకు సంబంధించి రైల్వేశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం.. ఓ స్టేషన్‌లో రిజర్వేషన్ చేసుకున్నవారు రైలు ఎక్కకపోతే.. తర్వాత స్టేషన్ వచ్చేలోపు ఆర్‌ఏసీ, వెయింటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి ఆ బెర్త్‌లు కేటాయించే వీలుంటుంది. దీంతో తర్వాత స్టేషన్‌లో రైలెక్కి నా బెర్త్ ఏదీ? అని అడిగేందుకు ప్రయాణికులకు హక్కు ఉండదు.
గతంలో రైల్వే టిటిఈలకు ప్రింట్ చేసిన రిజర్వేషన్ చార్ట్ లను అందించేవారు. దీంతో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుడు తాను ఎక్కవలసిన రైల్వేస్టేషన్లో ట్రైన్ ఎక్కకుండా తరువాత ఒక గంట కాలంలో తరువాత వచ్చే రెండు రైల్వే స్టేషన్లలో ఎక్కడ ఎక్కినా వారికి ఆ సీటును కేటాయించేవారు. ఇప్పుడు ఇకనుండి ఈ విధానం చెల్లదని రైల్వే పేర్కొంది. అందుకు కారణం.. గత కొంతకాలంగా టీటీఈలు.. రైలులో రిజర్వేషన్ వివరాలను హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ (ట్యాబ్స్ వంటివి) ద్వారా పరిశీలిస్తున్నారు. వాటిలో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌లోడ్ అవుతాయి. ఓ స్టేషన్‌లో రిజర్వేషన్ చేసుకున్నవారు రైలు ఎక్కకపోతే.. తర్వాత స్టేషన్ వచ్చేలోపు ఆర్‌ఏసీ, వెయింటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి ఆ బెర్త్‌లు కేటాయించే వీలుంటుంది. ఒకవేళ వచ్చే స్టేషన్‌లో రైలు ఎక్కాలనుకుంటే.. బోర్డింగ్ వివరాలు మార్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ సూచిస్తోంది.