క్రైమ్ స్టోరీ రాయాలని దొంగతనం చేసిన 'స్టోరీ రైటర్'.. చివరకు
X
కథలు రాయడం అతడికి హాబీ. దోపిడీ అంశంతో మంచి క్రైమ్ థ్రిల్లర్ కథ రాయాలనుకున్నాడు. ఏదో ఊహించుకుని, ఎవరి కథో ఎందుకని.. తానే ఓ దొంగతనం చేసి సొంత అనుభవాలతో స్టోరీ రాయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ స్టోరీ క్లైమాక్స్ మాత్రం పోలీసుల రాయడంతో చివరకు కటకటాల పాలయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌లో ఈ విచిత్ర ఘటన జరిగింది
అసలేం జరిగిందంటే?
రోహ్తక్ ఏక్తా కాలనీలో నివాసం ఉంటున్న ఇర్షాద్.. ఫరీదాబాద్‌లోని డబువా పాలి రోడ్డులో ఉన్న ఫ్యాన్ రెగ్యులేటర్లు తయారు చేసే సంజనా టూల్స్ అనే కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో ఏడాది కాలంగా పనిచేస్తున్న కృష్ణ కు.. గోరఖ్‌పుర్ జిల్లాకి చెందిన శైలేంద్ర కుమార్ అనే ఓ నేరగాడు పరిచయమయ్యాడు. అతడు ఇప్పటికే పలు కేసుల్లో దాదాపు ఎనిమిదేళ్లు జైలు జీవితం గడిపాడు. శైలేంద్ర ప్లాన్ తో తన సొంత కంపెనీ సంజనా టూల్స్‌లో చోరీ చేయాలని డిసైడ్ అయ్యాడు కృష్ణ . ఆ పథకాన్ని అమలు చేయడానికి అదే కంపెనీలో పనిచేస్తున్న సౌరభ్, ఇర్షాద్లకు చెప్పడంతో... వారు సరే అన్నారు. ఇర్షాద్ తన స్టోరీ కి ఈ చోరీ బాగా ఉపయోగపడుతుందని భావించి రంగంలోకి దిగాడు.
మొత్తానికి నలుగురు కలిసి జూన్ 21న కంపెనీలో దొంగతనం చేశారు. యజమాని కుందన్లాల్ను కొట్టి.. కట్టేశారు. అనంతరం రాగి తీగల కట్టలు, 58 వేల నగదు, యాజమాని స్కూటీతో పాటు మరికొన్ని విలువైన వస్తువులతో పరారయ్యారు. సమాచారం అందున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గాలింపు చర్యలు చేపట్టిన ఫరీదాబాద్ క్రైమ్ బ్రాంచ్ సెక్టార్-48 పోలీసు బృందం.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. సౌరభ్ మాత్రం తప్పించుకున్నాడు. నిందితుల వద్ద నుంచి 2 రాగి తీగల కట్టలు, రూ. 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తీసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఎలాంటి నేర చరిత్ర లేని ఇర్షాద్కు.. కథలు రాయడం అంటే పిచ్చి అని , దొంగతనం చేసి తన సొంత అనుభవాలతో కథ రాయాలనుకున్నాడని తెలిసింది. కానీ విధి వికటించి పోలీసులకు చిక్కాడు.