Home > జాతీయం > ఇండియాలో 19 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్.

ఇండియాలో 19 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్.

ఇండియాలో 19 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్.
X

యూట్యూబ్.. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇది తెలియని వారుండరు. ఎంతోమందికి ఇది కాలక్షేపం.. మరికొంతమందికి ఆదాయం తెచ్చే మార్గం. భారత్లో యూట్యూబ్ వీడియోలు చేసేవారు, చూసేవారి సంఖ్య ఎక్కువైపోయింది. తాజాగా యూట్యూబర్లకు సంస్థ నిర్వాహకులు షాకిచ్చారు. సుమారు 19లక్షలను వీడియోలను తొలగించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 64లక్షల వీడియోలను తీసేసింది.





కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉల్లంఘించినందుకు ఈ వీడియోలను తొలగించినట్లు తెలుస్తోంది. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ యూట్యూబ్ పాలసీలను ఎలా అమలు చేస్తుంది అనే దానిపై గ్లోబల్ డేటాను విడుదల చేసింది. కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉల్లంఘించినందుకు ఒక్క ఇండియాలోనే 1.9 మిలియన్స్ వీడియోలను తొలగించింది. అమెరికాలో 6,54,968, రష్యాలో 4,91,933, బ్రెజిల్‌లో 4,49,759 వీడియోలను తొలగించినట్లు తెలుస్తోంది. తాము మెషిన్ లెర్నింగ్, కొందరి రివ్యూయర్లతో కలిపి తమ విధానాలను అమలు చేస్తున్నట్లు యూట్యూబ్‌ స్పష్టం చేసింది.


Updated : 1 Sept 2023 2:28 PM IST
Tags:    
Next Story
Share it
Top